close

తాజా వార్తలు

Updated : 12/12/2020 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తమన్నా హార్ట్‌ను బ్రేక్‌ చేసింది ఎవరు..?

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత అక్కినేని వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్‌ షో ‘సామ్‌ జామ్‌’. విజయ్‌ దేవరకొండతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకూ రానా, నాగ్‌ అశ్విన్‌, సైనా దంపతులు పాల్గొని సందడి చేయడమే కాకుండా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా ఈ షోలో తమన్నా పాల్గొని తన లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొవిడ్‌-19 బారినపడిన సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను తమన్నా బయటపెట్టారు. అనంతరం, ఇన్‌స్టా ఖాతాలో తమన్నా తన గురించి తాను ఏవిధంగా అభివర్ణించుకున్నారో సమంత మాట్లాడారు. ‘‘తమన్నా భాటియా.. కాఫీ ప్రియురాలు, అప్పుడప్పుడు కవి, నటి అని ఉంది. మీరు కవితలు కూడా రాస్తారా? ఇప్పటివరకూ నాకు తెలియలేదు?’ అని సామ్‌ ప్రశ్నించగానే..

‘‘ఎప్పుడైతే మన హృదయం ముక్కలవుతుందో అప్పుడు మనం కవిత్వాలు రాస్తాం’ ఈ విషయం నీక్కూడా తెలుసు. మన జీవితంలో అలాంటిది ఏమైనా జరిగినప్పుడు మనం కవిగా¥ మారుతుంటాం. ఈ సమాజంలో ఎదుటివారి హృదయాలను ముక్కలు చేసే మనుషులు ఉన్నారు’’ అని తమన్నా సమాధానం చెప్పింది. దీంతో సామ్‌.. ‘తమన్నా హార్ట్‌ని బ్రేక్‌ చేసే ధైర్యం ఎవరికి ఉంది? ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి.’ అంటూ సరదాగా అన్నారు. అయితే, తన హార్ట్‌ బ్రేక్‌ అవడానికి గల కారణాన్ని మాత్రం తమన్నా బయటపెట్టలేదు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని