ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా: తమన్నా
close

తాజా వార్తలు

Published : 06/10/2020 01:55 IST

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా: తమన్నా

హైదరాబాద్‌: కరోనా బారినపడ్డ కథానాయిక తమన్నా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తమన్నా కొవిడ్‌-19తో బాధపడుతున్నట్లు ఆదివారం తెలిసింది. ఈ నేపథ్యంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దీంతో సోమవారం సాయంత్రం తమన్నా ఓ ప్రకటన విడుదల చేశారు.

సెట్‌లో తమ బృందం జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధతతోనే ఉన్నామని తమన్నా తెలిపారు. అయినప్పటికీ గత వారం తనకు స్వల్పంగా జ్వరం వచ్చిందని, దీంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, వైద్యుల సలహాతో చికిత్స తీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తనను ఆసుపత్రి నుంచి  డిశ్చార్జి చేసినట్లు తమన్నా పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా మందిని కరోనా ఇబ్బంది పెడుతుండగా.. తను పూర్తిగా కోలుకోవడం అదృష్టమేనన్నారు. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు. తను కోలుకోవాలని ప్రార్థించిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు తమన్నా ఈ ఏడాది ఆరంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’లోని ప్రత్యేక గీతంలో సందడి చేశారు. ఆమె నటించిన ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధమౌతోంది. ‘బోలె చుడియన్‌’ అనే హిందీ ప్రాజెక్టుకు కూడా సంతకం చేశారు. తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దిగంగన, భూమిక, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని