తమిళనాట మరో 60 మంది మృతి
close

తాజా వార్తలు

Published : 30/06/2020 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాట మరో 60 మంది మృతి

ఉన్నత విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్‌

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రోజు రోజుకీ నమోదువుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. గడిచిన 24గంటల్లోనే కొత్తగా 3943 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..  మరో 60 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 90వేల మార్కును దాటేసింది. మంగళవారం ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 90,167 కి చేరింది. వీరిలో 50,074 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1201 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 38889 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తమిళనాడు మంత్రికి పాజిటివ్‌

తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న దగ్గుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తాజాగా రెండోసారి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 

జిల్లాల వారీగా కరోనా వివరాలు ఇలా ఉన్నాయి...


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని