close

తాజా వార్తలు

Updated : 21/10/2020 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తారక్‌.. నీలాగా ఆలస్యం చేయను: చెర్రీ

ఇప్పటికే నువ్వు ఎంతో లేట్‌.. తెలుసుకో: తారక్‌

హైదరాబాద్‌: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల సరదా సంభాషణకు ట్విటర్‌ వేదికైంది. వీరిద్దరూ కలిసి నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’. జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నుంచి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 22న ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ విడుదల కానుంది. ‘రామరాజుఫర్‌భీమ్‌’ పేరుతో రానున్న ఈ సర్‌ప్రైజ్‌కి సంబంధించి ఓ స్పెషల్‌ గ్లిమ్స్‌ను బుధవారం చెర్రీ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘తారక్‌ బ్రదర్‌.. నిన్ను టీజ్‌ చేసేవిధంగా ఓ స్పెషల్‌ గ్లిమ్స్‌ విడుదల చేస్తున్నా. నీలాగా కాకుండా చెప్పిన సమయానికి(గురువారం ఉదయం 11 గంటలకు) ‘రామ్‌రాజుఫర్‌భీమ్‌’ విడుదల చేస్తా.’ అని చెర్రీ ట్వీట్‌ చేశారు.

కాగా, చరణ్‌ పెట్టిన ట్వీట్‌పై తారక్‌ సరదాగా స్పందించారు. ‘సోదరా.. ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యమయ్యావనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. జక్కన్నతో డీలింగ్‌ కాబట్టి నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండు. ఏదైనా జరగొచ్చు!! ఏది ఏమైనా.. పూర్తి వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తారక్‌ రిప్లై ఇచ్చారు.

దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా.. తారక్‌ కొమరంభీమ్‌గా కనిపించనున్నారు. అలాగే చెర్రీకి జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలివీయా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు చెర్రీ బర్త్‌డేని పురస్కరించుకుని విడుదల చేసిన ‘భీమ్‌ఫర్‌రామరాజు’ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తారక్‌ బర్త్‌డే సందర్భంగా మే నెలలో ‘రామరాజుఫర్‌భీమ్‌’ విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన విషయం విధితమే.
Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన