close
Array ( ) 1

తాజా వార్తలు

కణజాల వర్ధనం అంటే ఏమిటి?

8 మార్కుల ప్రశ్నలు
1. కణజాల వర్ధనం అంటే ఏమిటి? సంప్రదాయ పద్ధ తిలో మొక్కల ప్రజననం, సస్యాభివృద్ధి కార్యక్రమాల కంటే కణజాల వర్ధనం వల్ల వచ్చే లాభాలు ఏమిటి?
జ: మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకొని దాన్ని ఒక పరీక్ష నాళికలో సూక్ష్మజీవ రహిత పరిస్థితుల్లో ప్రత్యేక పోషక యానకంపై ప్రవేశపెట్టి పెంచినట్లయితే దాని నుంచి సంపూర్ణ మొక్కలు ఉత్పత్తయ్యే ప్రక్రియను కణజాల వర్ధనం అంటారు.

దీనిలోని దశలు
పోషక యానకం తయారుచేయడం: వివిధ రకాల ఖనిజ లవణాలు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కర్బన మూలకాలు గల యానకాన్ని పోషక  యానకం అంటారు. వీటిని శుద్ధజలంలో కలిపి ్పబీ = 5.6  6.0 ఉండేలా చూస్తారు. యానకానికి ఆక్సిన్‌లు, సైటోకైనిన్‌లు లాంటి ఫైటీ హార్మోన్‌లను కలుపుతారు. దీన్ని పరీక్షనాళికల్లోకి తీసుకొని వాటి మూతలను దూది బిరడాలతో బిగించాలి.
సూక్ష్మజీవ రహితం చేయడం: యానకంలో చక్కెర పదార్థాలు ఉండటం వల్ల సూక్ష్మజీవులు ఆకర్షితమై, యానకం ఫంకిలమై పాడవుతుంది. అందువల్ల స్మూక్షజీవులను నశింపచేయడం కోసం యానకాన్ని ఆటోక్లేవ్‌లో 15 పౌండ్ల పీడనం, 120ాది వద్ద 15 నిమిషాలు ఉంచాలి.

ఎక్స్‌ప్లాంట్‌ తయారీ: మొక్క దేహంలో ఒక భాగాన్ని తీసుకొని ద్రవరూప డిటర్జెంట్‌తో, మంచినీటితో, సోడియం హైపోక్లోరైడ్‌తో, శుద్ధజలంతో శుద్ధి చేయాలి.
ప్రవేశపెట్టడం (అంతర్నివేశనం): ఎక్స్‌ప్లాంట్‌ను వర్ధన పాత్రలో సూక్ష్మజీవ రహిత పోషక యానకం మీద ప్రవేశపెట్టడాన్ని అంతర్నివేశనం అంటారు. దీన్ని పూర్తిగా అసంక్రామిక వాతావరణంలో జరుపుతారు.
ఇంక్యుబేషన్‌: వర్ధనాలు 3  4 వారాలు ఇంక్యుబేట్‌ చేసిన తర్వాత ఎక్స్‌ప్లాంట్‌ కణాలు పోషక పదార్థాలను గ్రహించి పెరిగి, అనేక విభజనలు చెంది అవయవ విభేదనం చెందిన కణాల సమూహమైన కాలస్‌ను ఉత్పత్తి చేస్తుంది. వివిధ గాఢతల్లో ఉండే ఆక్సిన్‌లు, సైటోకైనిన్‌ల కలయికతో ఉన్న యానకంపై కాలస్‌ వర్ధనం చేసినప్పుడు వేర్లు, కాండాలు ఏర్పడతాయి. దీన్ని అవయవోత్పత్తి అంటారు. కాలస్‌ నుంచి ఏర్పడే పిండాల లాంటి నిర్మాణాలను శాకీయ పిండాభాలు అంటారు. వాటి చుట్టూ సోడియం ఆర్జనేట్‌ను చుట్టి కృత్రిమ విత్తనాలను తయారు చేయవచ్చు.
వాతావరణానుకూలత చెందించి కుండీల్లోకి మార్చడం: కణజాల వర్ధన ప్రక్రియ ద్వారా రూపొందించిన మొక్కలను నీటితో శుభ్రపరిచి ఎరువులు ఉన్న కుండీల్లోకి మార్చి తాత్కాలికంగా నీడ కల్పించి ఒక వారం తర్వాత వాటిని పొలాల్లోకి మార్చాలి.
ఉపయోగాలు: నీ కణజాల వర్ధనం ద్వారా తక్కువ సమయంలో పరిమితమైన ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. దీన్ని సూక్ష్మ వ్యాప్తి అంటారు.

ఉపయోగాలు
* విభాజ్యకణజాలాన్ని వర్ధనం చేసి వైరస్‌ రహిత  మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. * కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తయిన మొక్కలు జన్యుపరంగా తల్లి లేదా మూలాధార మొక్కలను పోలి ఉంటాయి. వీటిని సస్యప్రజననంలో ఉపయోగించవచ్చు. * శాకీయ పిండాభాల చుట్టూ సోడియం ఆల్జినేట్‌ అనే రసాయనాన్ని చుట్టి కృత్రిమ లేదా సంశ్లేషిత విత్తనాలు ఉత్పత్తి చేయవచ్చు.* కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తయిన మొక్కలు  త్వరితంగా అభివృద్ధి చెంది మంచి పుష్పాలు, ఫలాలను ఇస్తాయి. నీ విత్తనాలు లేకపోయినా, పరాగసంపర్క కారకాలు లేకపోయినా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. * పురుష వంధ్యత్వ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఉదా: ఆర్కిడ్స్‌, నెపెంథిస్‌
2. పునఃసంయోజక డీఎన్‌ఏ సాంకేతిక విధానంలోని  వివిధ ప్రక్రియలను క్లుప్తంగా వివరించండి.
జ: ఒక జీవిలోని జన్యువును విడదీసి కొన్ని వాహకాల  ద్వారా మరొక జీవిలోనికి ప్రవేశపెట్టే ప్రక్రియను జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ అంటారు.
వాంఛనీయ జన్యువును విడదీయడం: సాధారణంగా ఎంజైమ్‌లను ఉపయోగించి కణ కవచాన్ని, డిటర్జెంట్‌లను ఉపయోగించి కణ త్వచాలను విచ్ఛినం చేస్తారు. న్యూక్లియేజ్‌ ఎంజైమ్‌లను ఉపయోగించి డీఎన్‌ఏను వేరుచేస్తారు. తర్వాత రెస్ట్రిక్షన్‌ ఎండో న్యూక్లియేజ్‌లను ఉపయోగించి డీఎన్‌ఏను ఖండితాలుగా కత్తిరిస్తారు. ఈ ఖండితాలను జెల్‌ ఎలక్ట్రో ఫోరెసిస్‌ అనే ప్రక్రియ ద్వారా వేరుచేస్తారు. వాంఛనీయ ఖండితాలను సదరన్‌ బ్లాటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌ డీఎన్‌ఏ అణువులను రెండు విధాలుగా ....  

i్శ కొన్ని ఎంజైమ్‌లు డీఎన్‌ఏ రెండు పోగులకు సరిగ్గా  ఎదురెదురుగా చలిస్తాయి. దీనివల్ల మొండి కొనలు ఏర్పడతాయి.
ii్శ చాలా రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లు డీఎన్‌ఏ ద్వంద్వ కుండలిని  వివిధ ప్రాంతాల్లో కత్తిరిస్తాయి. దీన్ని స్టాగర్డ్‌ కత్తిరింపు అంటారు. ఫలితంగా వాటి కొనలు అతుక్కునే కొనలుగా ఉంటాయి.
ఉదా: నిఖి ఒక రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌. దీనిలో మొదటి అక్షరం ని ప్రజాతి పేరును సూచిస్తుంది (ఈశ్చరీషియా). తర్వాత రెండు అక్షరాలు ‘్న జాతిని సూచిస్తాయి (కోలై). ఈ మూడు అక్షరాలను ఇటాలిక్‌లో రాస్తారు.
ఈ ఎంజైమ్‌ GAA న్యూక్లియోటైడ్‌లను గ్వానిన్‌(A), అడినైన్‌ DNA ల మధ్య దీవితి ను కత్తిరిస్తుంది.

విడదీసిన జన్యువును తగిన వాహకంలోకి ప్రవేశపెట్టడం: వాంఛనీయ జన్యువును ఎన్నుకున్న తర్వాత వాటిని తగిన వాహకంలోకి ప్రవేశపెడతారు. డీఎన్‌ఏ ప్రతికృతి చెంది అసంఖ్యాకంగా జన్యువులను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని జన్యు క్లోనింగ్‌ అంటారు. రికాంబినెంట్‌ డీఎన్‌ఏ సాంకేతిక ప్రక్రియలో ప్లాస్మిడ్‌లు, ఫాజ్‌లు లాంటి అనేక రకాల వాహకాలను ఉపయోగించారు.

*ఆదర్శమైన క్లోనింగ్‌ వాహకం కొన్ని ధర్మాలు కలిగి  ఉండాలి. అవి: తక్కువ అణుభారం
* రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌ల కోసం ఒక విశిష్ట స్థానం
* ఆతిథేయి కణం లోపల ప్రతికృతి చెందగలిగే సామర్థ్యం
* సూక్ష్మజీవ నాశక నిరోధకత చూపే జన్యువు కలిగి  ఉండటం
ప్లాస్మిడ్‌లు: ప్లాస్మిడ్‌లను వేరుచేయడానికి మొదటగా బ్యాక్టీరియమ్‌ కణాన్ని నిదీగితితో, లైసోజోమ్‌ ఎంజైమ్‌తో చర్య జరిపి కణ కవచాన్ని విచ్ఛిన్నం చేస్తారు. ఆ తర్వాత బ్యాక్టీరియం కణాన్ని సోడియం లారిల్‌ సల్ఫేట్‌లో కేంద్రాపసరణ చేసి ప్లాస్మిడ్‌ను వేరుచేస్తారు. ఈ విధంగా వేరు చేసిన ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏను ఖండించడానికి రెస్ట్రిక్షన్‌ ఎండోన్యూక్లియేజ్‌ను ఉపయోగిస్తారు. లైగేజ్‌ అనే ఎంజైమ్‌ సహాయంతో వాంఛనీయ జన్యువును ప్లాస్మిడ్‌కు అతికిస్తారు. ఈ విధంగా ఏర్పడిన సంకర డీఎన్‌ఏను పునఃసంయోజక డీఎన్‌ఏ లేదా కైమెరిక్‌ డీఎన్‌ఏ అంటారు.

పునఃసంయోజక వాహకాన్ని ఆతిథేయిలోకి బదిలీ చేయడం:  ఒక డీఎన్‌ఏను రూపొందించిన తర్వాత అది ప్రతికృతి చెంది జన్యు లక్షణాలను ప్రదర్శించ గల తగిన బ్యాక్టీరియం కణంలోకి ప్రవేశపెడతారు. పునఃసంయోజక డీఎన్‌ఏను బదిలీ చేసిన బ్యాక్టీరియా కణాలను పరివర్తిత కణాలు అంటారు. బ్యాక్టీరియమ్‌లను కాల్షియం క్లోరైడ్‌ ద్రావణంలో చర్య జరిపితే క్రమంగా అది వాహకాలకు పారాగమ్యంగా తయారవుతాయి. ఆతిథేయి కణం లోపల ఈ పునఃసంయోజక డీఎన్‌ఏలు ప్రతికృతి చెందడం ప్రారంభిస్తాయి. ప్రతికృతి చెందిన వాహకం క్రమంగా పిల్ల కణంలోకి ప్రవేశిస్తుంది.
జన్యు పరివర్తిత ఆతిథేయి కణాలను వరణం ద్వారా ఎన్నుకోవడం: రికాంబినెంట్‌ క్లోన్‌ల వరణాన్ని రెండు రకాలుగా జరపవచ్చు.
ప్రోబ్‌లను ఉపయోగించకుండా: మొదట బ్యాక్టీరియమ్‌ కణాలను సూక్ష్మజీవ నాశకం లేని యానకంలో గంటసేపు ఉంచి తర్వాత సూక్ష్మజీవ నాశకం గల యానకంలోకి ప్రవేశపెట్టాలి. ఫలితంగా వాంఛనీయ కణాలు మిగిలి ఇతర కణాలు చనిపోతాయి.

ప్రోబ్‌లను ఉపయోగించి: దీనిలో కాలనీ హైబ్రిడైజేషన్‌ అనే పద్ధతిని ఆచరిస్తారు. రేడియోధార్మిక పదార్థాలతో లేబ్లింగ్‌ చేసిన ఏక పోచక ఆర్‌ఎన్‌ఏ లేదా డీఎన్‌ఏ ఖండితాన్ని ప్రోబ్‌ అంటారు. ఇది జీవుల్లోని సంపూరక న్యూక్లియోటైడ్‌ వరుసను గుర్తించగలుగుతుంది.
ఉదా: రికాంబినెంట్‌ డీఎన్‌ఏ టెక్నాలజీ ద్వారా మానవుడిలో ఇన్సులిన్‌ ఉత్పత్తికి కారణమైన జన్యువును వేరుచేసి, వాహకంలోకి ప్రవేశపెట్టి దాన్ని ఈ.కోలై బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. ఈ జన్యు పరివర్తిత బ్యాక్టీరియా కణం  మానవ కణాల మాదిరి ఇన్సులిన్‌ను ఉత్పిత్తి చేసింది. దాన్ని హ్యుములిన్‌ అంటారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.