ఏపీలో ఫ్యూడలిస్టు పాలన : యనమల
close

తాజా వార్తలు

Published : 30/07/2020 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ఫ్యూడలిస్టు పాలన : యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యూడలిస్టు పరిపాలన రాజ్యమేలుతోందని శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బుధవారం మీడియాతో యనమల మాట్లాడారు. ఎస్‌ఈసీగా రమేశ్‌ కుమార్‌ నియామకంలో ఎందుకింత తాత్సారం చేశారని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఏపీలో ఆర్టికల్‌ 243కేను ఉల్లంఘించటం అక్షరసత్యమన్న యనమల.. రాష్ట్రాలు లక్ష్మణ రేఖను అతిక్రమించినప్పుడు కేంద్రమే జోక్యం చేసుకోవాలన్నారు. ఈ రెండు బిల్లులపై ఆర్టికల్‌ 200, 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలని సూచించారు. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని