close
Array ( ) 1

తాజా వార్తలు

‘జగన్‌..ఆ జీవో జారీలో ఆంతర్యమేంటి?’

రాజమహేంద్రవరం: పోలీసుశాఖలో ఓ ఉన్నత ఉద్యోగిని సస్పెండ్‌ చేయడం దారుణమని తెదేపా నేత, మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. ఐపీఎస్‌ అధికారి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం నిరంకుశ ధోరణితో పాలన సాగిస్తోందని ఆరోపించారు. సీఎం జగన్‌ ఉద్యోగులను భయపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. 170 మంది పోలీసులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 3 నెలలు విధులకు హాజరుకాకపోతే జీతం ఇవ్వొద్దని జీవో జారీ చేయడంలో జగన్‌ ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసు అధికారుల సంఘం దీనిపై స్పందించాలని చినరాజప్ప సూచించారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.