అందుకే సీఎం ఇప్పుడు కాలు బయటపెట్టారు
close

తాజా వార్తలు

Updated : 23/10/2020 14:38 IST

అందుకే సీఎం ఇప్పుడు కాలు బయటపెట్టారు

పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నవాడాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరును ఎండగట్టారు. కరోనా వైరస్‌కు బయపడి ఇన్నిరోజులు ఇంట్లో కూర్చున్న ఆయన, ఇప్పుడు ఓట్లు అడగడానికి బయటకు వచ్చారంటూ మండిపడ్డారు. 

‘నితీశ్‌ కుమార్ 144 రోజుల పాటు నివాసంలోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పుడు, ఇప్పుడు కరోనా అలాగే ఉంది. కానీ, ఆయనకు ఇప్పుడు ఓట్లు కావాలి. అందుకే ఇంటి నుంచి కాలు బయటపెట్టారు. వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన తరుణంలో సుమారు 32 లక్షల మంది బిహార్‌ వాసులు ఉపాధి కోల్పోయి వివిధ ప్రాంతాల నుంచి సొంతరాష్ట్రానికి చేరుకున్నారు. వారికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం కబుర్లు చెప్పినప్పటికీ, నెరవేర్చలేకపోయింది. ఈ 15 సంవత్సరాల్లో ఆయన ఉద్యోగాలు ఇచ్చారా? పేదరికాన్ని రూపుమాపారా?’ అంటూ ఆ సభలో పాల్గొన్న ప్రజలను ఆర్జేడీ నేత ప్రశ్నించారు. 

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలకు నిరుద్యోగం ప్రధాన అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ హామీ ఇవ్వగా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని భాజపా తన మేనిఫెస్టోను విడుదల  చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని