తెలంగాణలో సామాజిక వ్యాప్తి లేదు
close

తాజా వార్తలు

Published : 11/06/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో సామాజిక వ్యాప్తి లేదు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ తేల్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. సీరమ్‌ సర్వేలో అతి తక్కువ మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మే 12 నుంచి 17 వరకు జనగామ, కామారెడ్డి, నల్గొండలో నమూనాలు సేకరించినట్లు వెల్లడించింది. మొత్తంగా సేకరించిన 1,200 నమూనాల్లో కేవలం నలుగురికి మాత్రమే పాజిటివ్‌ నిర్ధారణ అయిందని పేర్కొంది. హైదరాబాద్‌లోని 5 కంటైన్‌మెంట్‌ జోన్లలో తీసిన 500 నమూనాల్లో 15 మంది కరోనా బారినపడినట్లు వివరించింది. ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ తేల్చిందని ఆరోగ్య శాఖ ప్రకటనలో వెల్లడించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని