close

తాజా వార్తలు

Published : 04/11/2020 21:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రానున్న 3 నెలలు అత్యంత కీలకం’

ప్రజారోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు

వరంగల్‌: కరోనా నియంత్రణకు రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు శ్రీనివాస్ రావు తెలిపారు. వరంగల్‌లో వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కట్టడి చర్యలతో రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. పండగ సీజన్‌తో పాటు చలికాలం అయినందున రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్‌ విషయంలో అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదని హెచ్చరించారు. వైరస్‌ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన