close
Array ( ) 1

తాజా వార్తలు

రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ: కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లతో చర్చలు జరిపి తెలంగాణ సమగ్ర ధాన్యం, బియ్యం విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామన్నారు. అసెంబ్లీలో కూడా చర్చించి ఆమోదిస్తామని తెలిపారు. ‘‘ ఈసారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశముంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకుపైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశముంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో మాత్రం రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం రైస్‌ బౌల్ ఆఫ్‌ ఇండియాగా మారుతుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

సమగ్ర ధాన్యం, బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని, మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేయాలని కేసీఆర్‌ కోరారు. ఇంకా మరికొన్ని మిల్లులు అందుబాటులోకి రావాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలోని రైస్‌ మిల్లులు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రైస్‌ మిల్లర్లకు అధికారుల నుంచి వేధింపులు ఉండబోవని, వారికి సరైన మార్కెటింగ్‌ వ్యూహం ఉండాలని సూచించారు. రైస్‌ మిల్లులను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లుగా గుర్తించి.. వాటికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలని, గోదాముల నిర్మాణానికి ప్రభుత్వపరంగా సహకారం ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రైల్వే సైడింగ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.