అద్భుతమైన మార్పు కనిపిస్తోంది: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 09/05/2020 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అద్భుతమైన మార్పు కనిపిస్తోంది: కేటీఆర్‌

హైదరాబాద్: రబీ సీజన్‌లో దేశవ్యాప్తంగా గోధుమలు, ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన 50లక్షల టన్నుల ధాన్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటా 44.36లక్షల టన్నులని ఆయన తెలిపారు. అందులో తెలంగాణ నుంచి 34.36లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాంవిలాస్‌ పాసవాన్‌ వివరించారు.

పాసవాన్‌ ట్వీట్‌పై తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. రబీలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలవడం గర్వకారణమన్నారు. తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భంగా ఆయన అభివర్ణించారు. కేవలం ఆరేళ్లలోపే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన మార్పు కనిపిస్తోందని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని