close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భూదందాలపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ

అమరావతి: వైకాపా నాయకుల భూదందాలను నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తెదేపా నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, శ్రవణ్‌ కుమార్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో భూములను ఆక్రమించారని ఆ పార్టీ ఆరోపించింది. వాటిని పరిశీలించేందుకు కమిటీ సభ్యులు అమరావతి వెళ్లనున్నారని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో వైకాపా నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారని తెదేపా పొటిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.