HYD: కన్న బిడ్డలతో అసభ్య ప్రవర్తన.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

తాజా వార్తలు

Updated : 26/07/2021 10:22 IST

HYD: కన్న బిడ్డలతో అసభ్య ప్రవర్తన.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై జూబ్లీహిల్స్‌ ఠాణాలో పోక్సో చట్టం కింద రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఎన్‌ఆర్‌ఐ(45) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 70లో భార్య, కుమార్తె(14), కుమారుడు(11)తో కలిసి ఉంటున్నాడు. 2018లో ఏర్పడిన గొడవల నేపథ్యంలో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కొద్ది కాలంగా పిల్లలు ఇద్దరు దిగులుగా ఉండటంతో తల్లి వారిని ఒక సైకాలజిస్టు వద్ద కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే.. తండ్రి తమతో అయిదారేళ్ల కిందట అసభ్యంగా ప్రవర్తించారని, తండ్రితో పాటు అతడి స్నేహితుడు సైతం తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. విషయం తెలుసుకున్న తల్లి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు, అతడి స్నేహితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తండ్రిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. తండ్రి పక్కనున్న సమయంలోనే అతడి స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ కుమార్తె గతంలోనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని