సచిన్ దాతృత్వం: చికిత్సకు ఆర్థిక సాయం
close

తాజా వార్తలు

Published : 30/11/2020 22:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్ దాతృత్వం: చికిత్సకు ఆర్థిక సాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆరు రాష్ట్రాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 100 మంది పేద పిల్లల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాడు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న చిన్నారులకు ‘ఎకాం’ ఫౌండేషన్‌తో కలిసి సాయం చేశాడు.

‘‘ఫౌండేషన్‌లో సచిన్‌తో కలిసి పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆరోగ్య రంగంలో సచిన్ గొప్పగా పనిచేస్తున్నారు. పేదపిల్లలకు మరిన్ని వైద్యారోగ్య సదుపాయాలు అందించడానికి ప్రయత్నిస్తాం’’ అని ఎకాం ఫౌండేషన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ అమీతా ఛటర్జీ తెలిపారు. ప్రతి ఏడాది ఇలానే రెండు వేల మందికి పైగా సహాయం అందించాలని భావిస్తున్నారు. కాగా, యునెసెఫ్‌కు సౌహార్ద రాయబారిగా ఉన్న తెందుల్కర్ ఇటీవల అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఉన్న మకుంద ఆసుపత్రికి వైద్య పరికరాలను‌ దానం చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని