close

తాజా వార్తలు

తెనాలిలో ఉద్రిక్తత.. దీక్షా శిబిరానికి నిప్పు

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెనాలి పురపాలక కార్యాలయం వద్ద తెలుగుదేశం, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను వైకాపా కార్యకర్తలు దహనం చేసి.. అక్కడే ఉన్న అమరావతి పరిరక్షణ ఐకాస చేపట్టిన దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ దశలో తోపులాట కూడా జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఐకాస రిలేనిరహార దీక్షా శిభిరంపై టమాటా, కోడిగుడ్లతో వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పైనా కోడిగుడ్డు పడింది. వైకాపా కార్యకర్తలు ఐకాస శిబిరానికి నిప్పుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన తెదేపా కార్యకర్తలు ఆర్పివేశారు. ఈ ఘటనలో అమరావతి నినాదాలతో ఉన్న ఫ్లెక్సీలు కాలిపోయాయి.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.