close

తాజా వార్తలు

Published : 28/10/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ కుటుంబానికి కృతజ్ఞతలు: ధోనీ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ పేరులేకుండా చెన్నై జట్టును వర్ణించాలంటే దాదాపు అసాధ్యమే. కెప్టెన్‌గా చెన్నైకి ఎన్నో మరిచిపోలేని విజయాలు అందించాడు. అతని సారథ్యంలోనే చెన్నై ఎన్నో టైటిళ్లు.. మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది. అలా తన ఆటతీరు, ఒదిగి ఉండే తత్వంతో ధోనీ చెన్నై అభిమానులకు ఆరాధ్య క్రికెటర్‌ అయ్యాడు. అందుకే తమిళనాడులో ఓ అభిమాని ధోనీ పేరు, చిత్రాలతో ఏకంగా ఇల్లు నిర్మించాడు. చెన్నై జట్టు యాజమాన్యం ఆ ఇంటిని ట్విటర్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయింది. తాజాగా ఆ ఇంటిపై ధోనీ స్పందించాడు.
‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఇల్లును నేనూ చూశాను. ఇది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఒక ఇల్లు నిర్మించేముందు ఎన్నో కలలు కంటుంటాం. కుటుంబంలో అందరి ఇష్టాయిష్టాల మేరకే తీర్చిదిద్దుకుంటాం. ఇంట్లో ఎవరికి నచ్చకపోయినా ఆ ఇంటికి విలువ ఉండదు. అయితే.. ఇక్కడ ఆ అభిమాని కేవలం నా ఒక్కడికి కోసమే కాదు.. చెన్నై జట్టుపై అభిమానంతో ఇల్లు నిర్మించాడు. నిజానికి ఆ విషయంలో కుటుంబ సభ్యులంతా ఒకే నిర్ణయంపై ఉండటం పెద్ద విషయం. ఆ కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు’ అని ధోనీ అన్నాడు. 
తమిళనాడులోని కడలూరు జిల్లా అరంగూరుకు చెందిన గోపీ కృష్ణన్.. ధోనీకి వీరాభిమాని. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతను ధోనీ మీదున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇల్లు నిర్మించి దానికి పసుపురంగు వేయించాడు. ఇంటి గోడలను ధోనీ చిత్రాలు, చెన్నై జట్టు లోగోలతో నింపేశాడు. ‘హోమ్‌ ఆఫ్‌ ధోనీ ఫ్యాన్‌’ అని కూడా రాయించాడు.





Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని