పోలవరం నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలి
close

తాజా వార్తలు

Published : 31/10/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలవరం నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలి

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైకాపా, తెదేపా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాయని జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేశ్‌ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు పార్టీలు తమ వాదనతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కన పెడుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని కోరారు. వైకాపా ఏడాదిన్నర పాలనలో పోలవరం నిర్మాణ పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారని దుర్గేశ్‌ గుర్తు చేశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని జనసేన నాయకత్వం భాజపా నాయకులు, కేంద్ర మంత్రులతో చర్చిస్తోంది. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు జనసేన, భాజపా సమన్వయంతో ముందుకెళ్తాయని దుర్గేశ్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని