
తాజా వార్తలు
డ్రైవర్ నుంచి వ్యాపార వేత్తగా...
ముంబయి: ధనిక కుటుంబానికి చెందిన ఓ అందమైన జంట చాలా ఏళ్ల తర్వాత అమెరికా నుంచి స్వస్థలం భారతదేశానికి తిరిగి వచ్చింది. ఇక్కడికొచ్చాకా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేస్తారు. ఆ నేరంలో కారు డ్రైవర్‌ను ఇరికిస్తారు. ఆ తర్వాత ఆ డ్రైవర్ చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు. చివరికి పెద్ద వ్యాపార వేత్తగా ఎదుగుతాడు. అది ఎలా జరిగిందో తెలియాలంటే ‘ది వైట్ టైగర్’ సినిమా చూడాల్సిందే. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన చిత్రమిది. డ్రైవర్ పాత్రలో ఆదర్శ్ గౌరవ్ నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌తో పాటు పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగా పుస్తకం ‘ది వైట్ టైగర్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రమిన్ బెహ్రానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 22న నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుంది.
ఇదీ చదవండి
నన్ను అరెస్ట్ చేయలేదు: స్టార్ హీరో మాజీ భార్య