close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/01/2020 23:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త ఏడాది... టాలీవుడ్‌ ఆరంభం అదిరింది!

నాని, సమంత కామెంట్లు

హైదరాబాద్‌: కొత్త ఏడాది టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందని స్టార్స్‌ అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలు హిట్లు అందుకున్నాయి. రెండు సినిమాలూ విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందాయి. ఈ నేపథ్యంలో సమంత, నాని ట్వీట్‌ చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమ బంగారు రోజులు మనపైనే ఆధారపడి ఉన్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో..’తో 2020 గొప్పగా ఆరంభమైంది. రెండు చిత్ర బృందాలకు, ఈ సినిమా విజయంలో భాగస్వాములైన అభిమానులకు శుభాకాంక్షలు’ అని సామ్‌ ట్వీట్‌ చేశారు.

‘ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టాడు. ఈ ఏడాది బాక్సాఫీసు (వసూళ్లపరంగా) గొప్పగా ఉండబోతోందని మేం ప్రమాణం చేస్తున్నాం. రెండు చిత్ర బృందాలకు శుభాకాంక్షలు.. మీ తర్వాత ప్రాజెక్టులకు నా అభినందనలు’ అని నాని పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లతో రాణిస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.