కరోనా స్పెషల్‌ పానీయాలివి
close

తాజా వార్తలు

Published : 02/08/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా స్పెషల్‌ పానీయాలివి

కొవిడ్‌పై పోరాటానికి కొత్త దారులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. ఈ మహమ్మారి ప్రజల ఆరోగ్య అంశాలను ఎంతగానో ప్రభావితం చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంపై ప్రజలకు శ్రద్ధ పెరిగింది. కొవిడ్‌-19 అంటేనే హడలి పోతున్న ప్రజలు బయటి తిండి, పానీయాలను ముట్టుకోవటం లేదు. హోటళ్లు, రెస్లారెంట్లతో సహా స్థానిక టీ దుకాణాలకు రావటం కూడా దాదాపు మానేశారు.
తిరిగి ఇంటి ఆహారం, పాత నియమాల వైపు మళ్లుతూ.. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం పట్ల దృష్టి సారిస్తున్నారు. అనుకోని విపత్కర పరిస్థితి ఎదురైన పరిస్థితుల్లో పాత తరాల వారు చెప్పే ఆహార నియమాలు, అలవాట్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రకృతి సహజంగా లభించే వస్తువులు రోగనిరోధకతను పెంచుతున్నాయని పూర్వీకులు చెప్పిన మాటను ప్రజలు అమలు చేస్తున్నారు. కాఫీ, టీ తదితర పానీయాలకు బదులు కషాయం వంటి ఆరోగ్యదాయక పానీయాల సేవనం ఉత్తమమని వారు భావిస్తున్నారు.

అయితే, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లతో చిరువ్యాపారులకు ఇక్కట్లు ఎదురౌతున్నాయి. సాధారణ రోజుల్లో కిటకిటలాడిన టీ స్టాళ్లు, కాఫీ షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఆ లోటు భర్తీ చేసుకునేందుకు చిరు వ్యాపారులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.  ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సేవలందిస్తున్నారు. వినియోగదారులకు కషాయం, అల్లం టీ, పసుపు పాలు వంటి పానీయాలు అందిస్తూ గిరాకీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ స్టాళ్లలో బాదం, పసుపు పాలు, కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. మార్పుకు తగినట్టుగా అల్లం, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వంటి పదార్ధాలను కషాయం, చాయ్‌లలో కలిపి తమ గిరాకీని పెంచుకుంటున్నారు. ఈ విధమైన పానీయాలను ఇంట్లో తయారు చేసుకునే అవకాశం లేనివారు, ఇతర పనులపై బయటకు వచ్చే వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అల్లం, శొంఠి వంటి ప్రకృతిసిద్ధ పదార్ధాలతో వీరు తయారు చేస్తున్న ‘యాంటీ కరోనా స్పెషల్‌ టీ’కి గిరాకీ పెరిగింది.
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని