
తాజా వార్తలు
ప్రధాని మోదీకి స్వాగతం పలికేది ఎవరంటే!
హైదరాబాద్: శనివారం హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు కేవలం అయిదుగురు అధికారులకు మాత్రమే అవకాశం లభించింది. దీనికి సంబంధించి పీఎంఓ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సమాచారం అందింది. ఈ విషయాన్ని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్కు శుక్రవారం ఫోన్లో తెలియజేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారని సీఎస్ పీఎంఓకు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామహంతి, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కొవిడ్ నివారణకు సంబంధించి భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న ‘కొవాగ్జిన్’ టీకా పురోగతిని పరిశీలించేందుకు మోదీ హైదరాబాద్ వస్తున్నారు.