close

తాజా వార్తలు

కంటతడి పెట్టించిన చిన్నారి వీడియో

ఛత్తీస్‌గఢ్‌: ‘నానా’.. అంటూ ఓ చిన్నారి తన తండ్రి విగ్రహానికి ముద్దుపెట్టి ఆప్యాయంగా పలకరించింది. విగ్రహాన్నే తన తండ్రిగా భావించి ఆ చిన్నారి కురిపించిన ప్రేమ అందరిచేతా కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కోర్బా నగరంలో ఎస్సైగా ఉన్న మూలచందర్‌ గతేడాది జరిగిన నక్సల్స్‌ దాడిలో అమరుడయ్యారు. ఆ సమయంలో ఆయన భార్య గర్భవతి. కొన్ని రోజులకి ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం తర్వాత మూలచందర్‌ జయంతి రోజున కుటుంబసభ్యులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదే సమయంలో ఆ పాపకు ఇతనే మీనాన్న అని చెప్పగానే.. ఆ చిన్నారి విగ్రహం వద్దకు వెళ్లి ‘నానా’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. విగ్రహాన్ని కౌగలించుకుని ముద్దుపెట్టుకుంది. అనంతరం విగ్రహానికి మిఠాయి తినపించబోయింది. నిజ జీవితంలో తండ్రిని చూడలేకపోయినా ఆ విగ్రహంపై కూతురు కురిపించిన ప్రమేను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.