కదం తొక్కిన బిహార్ రైతన్న!
close

తాజా వార్తలు

Published : 29/12/2020 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కదం తొక్కిన బిహార్ రైతన్న!

పట్నా: దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతన్నలకు మద్దతుగా బిహార్‌ అన్నదాతలు కదం తొక్కారు. రాష్ట్ర రాజధాని పట్నాలోని రాజభవన్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. నూతన సాగు చట్టాలకు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్‌భవన్‌ వద్ద భారీ స్థాయిలో బలగాల్ని మోహరించారు. రహదారులపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులు వాటిని తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘అఖిల భారతీయ కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ్‌ సమితి’ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. వాపక్ష పార్టీలకు చెందిన పలు రైతుల సంఘాలు కూడా ఇందులో పాల్గొన్నాయి.

మరోవైపు దిల్లీలో అన్నదాతల ఆందోళన 34వ రోజుకి చేరింది. సింఘు, టిక్రి, ఘాజిపూర్, చిల్లా సహా పలు దిల్లీ సరిహద్దుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రైతన్నలు పట్టు వీడడం లేదు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం కేంద్రంతో రైతు సంఘాల ఆరో దఫా చర్చలు జరపనున్నాయి. కేంద్రం ఇప్పటికే రైతు సంఘాలకు చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొత్త సాగు చట్టాలు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని కేంద్రం తెలిపింది. మరోవైపు రేపు సింఘు సరిహద్దు నుంచి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

రైతులతో చర్చలు రేపు

పార్టీపై రజనీకాంత్‌ సంచలన ప్రకటన


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని