మానేరు వాగులో స్నానానికి దిగి ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Updated : 23/04/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మానేరు వాగులో స్నానానికి దిగి ముగ్గురి మృతి

సుల్తానాబాద్: మానేరు వాగులో దిగి ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల వద్ద చోటుచేసుకుంది. ఐతురాజుపల్లి గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మానేరు వాగులో స్నానానికి దిగారు. ఈ క్రమంలో వాగులో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. వాగులో కొట్టుకుపోతున్న మరో ఐదుగురిని స్థానికులు కాపాడారు. అనంతరం గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.  మృతులను ఐతరాజుపల్లికి చెందిన జోగుల ఆశీష్‌, జోగుల మనోజ్‌తో పాటు వేములవాడకు చెందిన రాహుల్‌గా గుర్తించారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని