close

తాజా వార్తలు

Updated : 24/03/2020 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏలూరులో 3 కరోనా అనుమానిత కేసులు

ఏలూరు(క్రైం): పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో ముగ్గురు చేరారు. తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి కుమారుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. ఈనెల 18న పశ్చిమ గోదావరి జిల్లా రాఘవాపురానికి చెందిన ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకకు ఆ యువకుడు హాజరయ్యాడు. అనంతరం హైదరాబాద్‌ తిరిగి వెళ్లిపోయిన ఆ యువకుడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా ఈ నెల 22న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలియడంతో పశ్చిమ గోదావరి జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

పుట్టినరోజు వేడుక జరుపుకున్న చిన్నారి, ఆమె తల్లిని ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసొలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా పుట్టినరోజు వేడుక జరిగిన రోజు సదరు యువకుడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వారిని గ్రామంలో ఒకచోట ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరితో పాటు ఇటీవల విదేశాల నుంచి వచ్చిన కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడేనికి చెందిన 47 ఏళ్ల వ్యక్తికి దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో ఆయన్ను సైతం ఐసొలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా చేరిన ముగ్గురితో కలిపి కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎనిమిదికి చేరినట్లు డీసీహెచ్‌ఎస్‌ డా.శంకరరావు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని