ట్రంప్‌ ఎఫెక్ట్‌: టిక్‌టాక్‌ సీఈవో రాజీనామా
close

తాజా వార్తలు

Updated : 27/08/2020 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌ ఎఫెక్ట్‌: టిక్‌టాక్‌ సీఈవో రాజీనామా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టిక్‌టాక్‌పై వ్యతిరేకత పెరిగిపోవడంతో సీఈవో కెవిన్‌ మాయర్‌ రాజీనామా చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి టిక్‌టాక్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కెవిన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నారు. ‘‘ఇటీవల కాలంలో రాజకీయ వాతావరణం వేగంగా మారిపోయింది. ప్రపంచస్థాయిలో వ్యాపారానికి అవసరమైన మార్పులను కార్పొరేట్‌ వ్యవస్థలో చేశాను. నేను వైదొలగుతున్నాను’’ అని ఉద్యోగులకు పంపిన లేఖలో కెవిన్‌ పేర్కొన్నట్లు ఆంగ్ల పత్రిక సీఎన్‌ఎన్‌ పేర్కొంది.  

‘‘ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరంగానే ఉంది’’ అని ఆ లేఖలో కెవిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కెవిన్‌ రాజీనామాను గౌరవిస్తున్నట్లు టిక్‌టాక్‌ ప్రతినిధి వెల్లడించారు. 

కెవిన్‌ గతంలో డిస్నీలో పనిచేశారు. నాలుగు నెలల క్రితం టిక్‌టాక్‌ ఆయన్ను సీఈవోగా నియమించింది. అమెరికా రెగ్యులేటరీలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేసి ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళతారని అంచనావేసింది. కానీ, ట్రంప్‌ సర్కారు టిక్‌టాక్‌పై దాడిని పెంచింది. మరోపక్క బ్యాన్‌ను తప్పించుకోవాలంటే అమెరికాలో వ్యాపారాన్ని విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని