దీర్ఘకాలిక అవకాశాలపై దృష్టి సారించిన టిక్‌టాక్‌
close

తాజా వార్తలు

Published : 14/11/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీర్ఘకాలిక అవకాశాలపై దృష్టి సారించిన టిక్‌టాక్‌

భారత్‌లోకి త్వరలో రాబోతున్న వీడియో యాప్‌

ఉద్యోగులకు లేఖ రాసిన టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో నిషేధానికి గురైన పబ్‌జీ మళ్లీ దేశంలోకి  రాబోతోంది. అలానే ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్ కూడా త్వరలో అడుగు పెట్టేందుకు సమాయత్తవుతోంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ రాసిన లేఖను బట్టి దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. యూజర్ల డేటాను గోప్యంగా ఉంచడంతోపాటు భద్రతాపరమైన అన్ని చర్యలను సంస్థ తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందన్న నమ్మకం ఉందని లేఖలో పేర్కొన్నారు. డేటా గోప్యత, భద్రతతోపాటు స్థానిక చట్టాలను పాటించడానికి బైట్‌డ్యాన్స్‌ యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌ కట్టుబడి ఉందని చెప్పారు. భారత్‌లో టిక్‌టాక్‌కు దీర్ఘకాలికంగా అపారమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. 

‘‘టిక్‌టాక్ యాప్‌కు సంబంధించి మన వివరణలు ప్రభుత్వానికి సమర్పించాం. వారికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మన ప్లాట్‌ఫామ్‌తో గుర్తింపునే కాకుండా జీవనోపాధికి కొత్త మార్గాలను అన్వేషించిన వినియోగదారులు, క్రియేటర్స్‌ కోసం ఉద్యోగులందరం అంకిత భావంతో పని చేస్తాం’’ అని టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ వెల్లడించారు. టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన వుయ్‌ చాట్‌, యూసీ బ్రౌజర్‌, పబ్‌జీ ఇంకా 117 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని