టిక్‌టాక్‌ను మాకు విక్రయించడం లేదు: మైక్రోసాఫ్ట్‌
close

తాజా వార్తలు

Published : 14/09/2020 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌ను మాకు విక్రయించడం లేదు: మైక్రోసాఫ్ట్‌

వాషింగ్టన్‌: అమెరికాలో నిషేధపు అంచుల్లో ఉన్న టిక్‌టాక్‌ యాప్‌ను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ నిరాకరించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రతిపాదనను అంగీకరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. దేశ, పౌరుల భద్రత దృష్ట్యా తమ కొనుగోలు ప్రతిపాదనలు టిక్‌టాక్‌ వినియోగదారులకు శ్రేయోదాయకంగా ఉండేదని విశ్వాసం వ్యక్తం చేసింది. పౌరుల, దేశ, సైబర్‌ భద్రతలకు అనుగుణంగా.. నకిలీ సమాచారం అరికట్టేలా మార్పులు చేసేవాళ్లమని వివరించింది.  

టిక్‌టాక్‌ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ, వారి సమాచార భద్రతపై యూఎస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో యాప్‌ యూఎస్‌ కార్యకలాపాలను విక్రయించేలా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సెప్టెంబరు 15 వరకు గడువు విధించారు. దాన్ని పొడిగించే యోచనేమీ లేదని ఇటీవలే తేల్చి చెప్పారు. మరోవైపు ట్రంప్‌ ఆదేశాలపై బైట్‌ డ్యాన్స్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నిషేధాన్ని ఎదుర్కోవడమో లేక ఏదో ఒక సంస్థకు విక్రయించడమో చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ఆసక్తిచూపిన మైక్రోసాఫ్ట్‌ను బైట్‌ డ్యాన్స్‌ తిరస్కరించింది. 

ఒరాకిల్‌ వైపు బైట్‌డ్యాన్స్‌ మొగ్గు...

ఇక టిక్‌టాక్‌ కొనుగోలు రేసులో ఉన్న మరో ప్రముఖ సంస్థ ఒరాకిల్‌. మైక్రోసాఫ్ట్‌ను నిరాకరించిన నేపథ్యంలో టిక్‌టాక్‌ అమ్మకానికి బైట్‌ డ్యాన్స్‌ దీన్నే ఎంచుకున్నట్లు పలు అమెరికన్‌ పత్రికలు కథనాలు ప్రచురించాయి. టిక్‌టాక్‌ కొనుగోలుకు ఒరాకిలే సరైందని ట్రంప్‌ సైతం గతంలో వ్యాఖ్యానించారు. ఈ యాప్‌ కొనుగోలుకు మరికొన్ని సంస్థలు సైతం ఆసక్తి కనబరిచినా.. ఒరాకిల్‌ వైపే బైట్‌డ్యాన్స్‌ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని