close

తాజా వార్తలు

పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్

రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలికి వెళ్లి మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో అటువైపుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.