close

తాజా వార్తలు

Published : 14/01/2020 19:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టైటిల్‌ ఫిక్స్‌.. సాయిపల్లవి లుక్‌ రివీల్‌!

హైదరాబాద్‌: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా టైటిల్‌ ఖరారైంది. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. సాయి పల్లవి లుక్‌ను కూడా రివీల్‌ చేశారు. ప్రచార చిత్రంలో సాయిపల్లవి..  చైతన్య చొక్కాను పట్టుకుని భావోద్వేగానికి గురౌతూ కనిపించారు. ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు.

‘ఫిదా’ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. వేసవిలో కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్‌ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరోపక్క వరుస హిట్లతో ఉన్న చైతన్య ఎంచుకున్న కథ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన