
తాజా వార్తలు
ఆ జట్టు గెలిస్తేనే లీగ్‌కు మంచిది: సెహ్వాగ్
ఫైనల్ మ్యాచ్‌పై వీరూ విశ్లేషణ
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండగా.. టోర్నీ ఆరంభం నుంచి భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాన్ ‘వీరూకి బైటక్’ ద్వారా తన విశ్లేషణ అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో సెహ్వాగ్ చెప్పిన జట్లే దాదాపు విజయం సాధించాయి కూడా. అందరిలాగే తాను కూడా ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్తూనే ఈసారి కాబోయే ఛాంపియన్ ఎవరనేది వీరూ జోస్యం చెప్పేశాడు. అయితే.. ఛాంపియన్ ఎవరనేది తేలాలంటే ఈ రోజు దిల్లీ, ముంబయి జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ ముగిసే వరకూ వేచి చూడాల్సిందే అన్నాడు. అంతేకాదు.. టాస్ గెలిచిన జట్టు ఏం తీసుకోవాలి.. ఎలాంటి మ్యాచ్ ప్లాన్ అమలు చేయాలి అనే విషయాల్లో వీరూ పలు ‘ఉచిత’ సలహాలిచ్చాడు.
గబ్బర్ పంజరం నుంచి వచ్చిన పావురం..
‘‘దిల్లీకి ఇది ఒక కొత్త అనుభవం. కొత్తగా కారు కొన్న యజమానికి.. కొత్తగా ప్రేమలో పడ్డ యువకుడికి ఎలా ఉంటుందో.. దిల్లీకి ఈ ఫైనల్ మ్యాచ్ అచ్చం అలాంటిదే. ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ముంబయి బ్యాటింగ్ ఆర్డర్‌కు గురించి మనకు తెలిసిందే. వాళ్లు మొదటి బ్యాటింగ్ చేస్తే 200+పరుగుల బంపర్ ఆఫర్ ఇవ్వడం ఖాయం. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఒకవేళ టాస్ గెలిస్తే కెప్టెన్ అయ్యర్ తీసుకునే నిర్ణయం కీలకం. టాస్ గెలవాలని అయ్యర్ ఆ దేవుణ్ని వేడుకోవాలి. దిల్లీకి ధావన్, స్టాయినీస్ అదిరిపోయే అరంభం ఇవ్వాలి. బ్యాట్స్‌మెన్‌ను బయపెట్టే బౌలర్లు బుమ్రా, బౌల్ట్ ముంబయిలో ఉన్నారు. కానీ, ధావన్ ఉన్న ఫామ్‌లో వాళ్ల మంత్రం పనిచేసే అవకాశం తక్కువే. అతను పంజరంలో నుంచి బయటికి వచ్చిన పావురంలాంటి వాడు. సీజన్లో నాలుగుసార్లు డకౌట్ అయిన తర్వాత కూడా టోర్నీ టాప్2 స్కోరర్‌గా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ధావన్‌తో దిల్లీకి ఓపెనింగ్ సమస్య పూర్తిగా సమసిపోయింది. మిడిల్ ఆర్డర్ ఒక్కటే ఇబ్బందిగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో హెట్మైయెర్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయ్యర్, పంత్ పరుగులు చేయాలి’.
ఆ రెండు జోడీలు కీలకం..
ఇక ముంబయి గురించి మాట్లాడాలంటే.. ఈ జట్టులో రెండు జోడీలు కీలకం.. అవి పాండ్య-పొలార్డ్, బుమ్రా-బౌల్ట్. ఈ రెండు జోడీలు ముంబయిని అలవోకగా ఫైనల్‌కు చేర్చాయి. ఈ సీజన్లో ‘వడాపావ్’ రోహిత్ ఎలాగూ ఫామ్‌లో లేడు. అయినా.. అది జట్టుకు పెద్ద సమస్యేం కాబోదు. ఓపెనింగ్‌లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టింది అతనే. మ్యాచ్‌లో పొలార్డ్, హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్ కీలకం. ఇప్పటి వరకూ వాళ్లిద్దరూ కలిసి 85 బంతులు ఎదుర్కొని 229 స్ట్రైక్‌రేట్‌తో 195 పరుగులు చేశారు. మూడు బంతులకో బౌండరీ కొట్టారు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్ ఇద్దరూ కలిసి ముంబయిని బలంగా తయారుచేశారు. ఈ మ్యాచ్‌లో రబాడ, బుమ్రాకు పోటీ ప్రధానం.
మొత్తానికి.. ఈ మ్యాచ్‌లో దిల్లీపై విజయం సాధించి ముంబయి మరోసారి ట్రోఫీని ముద్దాడుతుందని నా అభిప్రాయం. కానీ.. నా అభిప్రాయం నిజం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాచ్‌లో దిల్లీ గెలిచి కొత్త ఛాంపియన్‌గా అవతరించాలి. అదే లీగ్‌కు మంచింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నచ్చింది దొరికిందట.. పోజులిస్తున్న అనుపమ
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
