close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 30/05/2020 21:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేపటితో ముగియనున్న ‘ఎర్లీబర్డ్‌’ గడువు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆస్తిపన్నుపై 5 శాతం ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వార్షిక ఆదాయపు పన్ను పరిమితి రూ.30 వేలు ఉంటేనే ఈ ప్రోత్సాహకం వర్తింస్తుందని.. గతంలో ప్రకటించిన పురపాలక శాఖ ఆ పరిమితిని ఎత్తివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను ఎంత ఉన్నా మే 31లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఆస్తిపన్ను చెల్లింపునకు రేపు చివరిరోజు కావడంతో ఆదివారం సాయంత్రం వరకూ మీ-సేవా, సిటిజన్‌ సర్వీస్ సెంటర్లు పనిచేస్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎర్లీబర్డ్‌ అవకాశాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని కమిషనర్‌ కోరారు. ఆన్‌లైన్‌ ద్వారా లేదా బిల్‌కలెక్టర్‌కు నేరుగా ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందవచ్చని కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.