close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023392 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => SLls5WAhOIo [video_short_link] => SLls5WAhOIo [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-02-18 12:56:53.348959 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 1PM

1. బాధితులకు భరోసా కల్పించాలి: చంద్రబాబు

రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైకాపా అరాచక, అసమర్థ, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ బాధితులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 1800 దాటిన కరోనా మృతులు

చైనాలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బారిన పడి మరణించిన వారి సంఖ్య 1800 దాటింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సులో సోమవారం 93 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1863కు చేరింది. మరో 1,807 కొత్త కేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 72,300 తాకింది. ఆదివారంతో పోలిస్తే మరణాలు, కొత్తగా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య తగ్గడం గమనార్హం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిను వీడి ఉండలేను..: అనుష్కశర్మ

 న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వన్డే సిరీస్‌ తర్వాత తన సతీమణి అనుష్కశర్మతో కలిసి విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క తన భర్తను విడిచి భారత్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విరాట్‌ను ఉద్దేశించి అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు పెట్టింది. ‘వీడ్కోలు పలకడం.. సమయంతో పాటు తేలికవుతుందని నువ్వు భావిస్తుండొచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు’ అని విరాట్‌తో దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను అభిమానులతో పంచుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నొప్పించినవాళ్లను ఒప్పించేందుకు..

భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్ఠాత్మక నిర్ణయాలైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), అధికరణ 370 రద్దును విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఐరోపా సమాఖ్య(ఈయూ) వేదికపై గట్టిగా సమర్థించారు. ఈయూతో మెరుగైన సంబంధాలే లక్ష్యంగా బ్రస్సెల్స్‌ పర్యటన చేపట్టిన ఆయన సోమవారం జరిగిన సమాఖ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సీఏఏ, అధికరణ 370 రద్దుని కొన్ని దేశాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని జైశంకర్‌ సభ్యులకు వివరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన మాజీ ఎంపీ  

 ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ తపస్‌ పాల్‌ మంగళవారం హఠాత్తుగా కన్నుమూశారు. ఇటీవల మహారాష్ట్ర వెళ్లిన ఆయన కోల్‌కతా తిరిగి వస్తుండగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలారు. చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుమార్తెను కలిసేందుకు పాల్‌ ఇటీవల ముంబయి వెళ్లారు. నిన్న రాత్రి కోల్‌కతాకు తిరుగుపయనమవుతుండగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో గుండెపోటుతో కుప్పకూలారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘గాంధీ.. గాడ్సే కలిసుండలేరు’

తాను ఏ పార్టీలో చేరనని, తన జీవితం బిహార్‌కే అంకితమన్నారు ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్‌ కిశోర్‌. ‘పార్టీ సిద్ధాంతాల గురించి నాకు, నితీశ్‌కు మధ్య చాలా చర్చ జరిగేది. గాంధీజీ సిద్ధాంతాలు, ఆదర్శాలను పార్టీ ఎన్నటికీ వీడబోదని సీఎం ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు గాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో(ఎన్డీయేను ఉద్దేశిస్తూ) పార్టీ కలిసి పనిచేస్తోంది. నా వరకైతే.. గాంధీజీ గాడ్సే కలిసిమెలిసి ఉండలేరు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పుకొచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొవిడ్-19 కారణంగా ఆగిన అంత్యక్రియలు

కొవిడ్ కారణంగా ఓ వ్యక్తి తన తల్లికి అంత్యక్రియలు జరపలేని పరిస్థితి నెలకొంది. ముంబయికి చెందిన 35 ఏళ్ల పునీత్ మెహ్రా ఆస్ట్రేలియాలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మూడు వారాల క్రితం ఆయన తన తల్లి రితా మెహ్రాతో కలిసి ఎయిర్ చైనాకు చెందిన విమానంలో ఆస్ట్రేలియా నుంచి ముంబయికి వస్తుండగా గుండెపోటుతో ఆమె విమానంలోనే మృతి చెందింది. దీంతో రితా మెహ్రా మృతదేహాన్ని స్థానిక హెనాన్‌ ప్రొవిన్షియల్ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే కొవిడ్ కారణంగా చైనాలో ఆంక్షలు అమల్లో ఉండటంతో మృతదేహాన్ని తర్వాత పంపుతామని అక్కడి అధికారులు తెలపడంతో దీపక్‌ ముంబయికి చేరుకున్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాక్‌పై ఎఫ్‌ఏటీఎప్‌ కీలక వ్యాఖ్యలు!

 పాకిస్థాన్‌ ‘గ్రే లిస్ట్‌’పై కీలక నిర్ణయం తీసుకోనున్న తరుణంలో ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద సంస్థలకు ఇంకా అక్రమ మార్గాల ద్వారా నిధులు అందుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సహకారం ఇంకా కొనసాగుతూనే ఉందని తేటతెల్లం చేసింది. వారం రోజుల పాటు జరిగే ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు ప్యారిస్‌లో ప్రారంభమయ్యాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మసూద్‌ పారిపోలేదు.. భద్రంగా దాచిపెట్టారు

దాయాది దేశం పాకిస్థాన్‌ చెబుతున్నట్లుగా మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌ నిజంగానే కన్పించకుండా పోయాడా..? అంటే కానే కాదంటున్నాయి భారత నిఘా సంస్థలు. పాకిస్థాన్ ఆర్మీ‌, ఐఎస్‌ఐ స్వయంగా అజార్‌ను అత్యంత భద్రమైన ప్రదేశంలో దాచిపెట్టాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో ఓ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ ఇంట్లో అజార్‌ సురక్షితంగా దాక్కొన్నాడట.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చైనాలో ఐఫోన్ల ఉత్పత్తి తగ్గిందని పేర్కొన్న ఆపిల్‌

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.