close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం కేబినెట్‌ భేటీ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. గత కొన్ని రోజులుగా చైనాలో నమోదవుతున్న కేసులు భారీస్థాయిలో తగ్గడంతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షలను సడలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడిచేయడంలో చైనా తీసుకున్న చర్యలపై సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇదిలాఉంటే, తాజాగా చైనాలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఈసారి వ్యాధి నిర్ధారణ అవుతున్నప్పటికీ లక్షణాలు కనిపించకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇబ్బందుల్లో ఉన్నారు.. కనీసం రూ.5వేలివ్వండి

కరోనా మహమ్మారి వల్ల అందరూ బాధపడుతున్నారని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని చెప్పారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిచేస్తే గానీ పూటగడవని ఎంతోమంది పేద ప్రజలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయి. దిల్లీ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోంది. అలాగే, ఏపీలో కూడా పేదలకు తొలివిడతగా కనీసం రూ.5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలి.’’ అని చంద్రబాబు కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌కు అమెరికా భారీ సాయం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అమెరికా భారీ సాయం ప్రకటించింది. 2.9 మిలియన్‌ డాలర్లు ఇవ్వనున్నట్టు అగ్రరాజ్యం వెల్లడించింది. యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ఏఐడీ) ద్వారా ఈ ఆర్థిక సహకారం అందజేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ ఓ ప్రకటన చేశారు. కొవిడ్‌-19ను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సాయం భారత్‌కు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని తిప్పికొట్టేందుకు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ), యూఎస్‌ఏఐడీ వంటి సంస్థలు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘కరోనావ్యాప్తికి మతాన్ని వేలెత్తి చూపడంసరికాదు’

కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సామాజిక బాధ్యతగా కరోనా వైరస్‌ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త అనిరుధ్‌ రెడ్డి తన సొంత ఖర్చుతో ప్రజలకు శానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శానిటైజర్లు తీసుకెళ్తున్న వాహనాలను గాంధీభవన్‌ వద్ద ఉత్తమ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తిలో కొందరు మతాన్ని వేలెత్తి చూపుతున్నారని.. అది సరైంది కాదని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయంటే...

6. కరోనాతో చనిపోతే బీమా పరిహారానికి నో చెప్పొద్దు!

కొవిడ్‌-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిష్కార ప్రక్రియను వేగంగా చేపట్టాలని సూచించింది. కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌కు ‘ఫోర్స్‌ మెజర్‌’ (Force Majerue) నిబంధన వర్తించదని వెల్లడించింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు ‘ఫోర్స్‌ మెజర్‌’ను అమలు చేస్తారు. కరోనాకు దీనిని వర్తింపజేయడం లేదని జీవిత బీమా మండలి తెలిపింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇది ఈవెంట్‌ కాదు.. మూవ్‌మెంట్‌

కరోనావైరస్‌పై చేస్తున్న పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని నటుడు సాయికుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని రూపొందించి ప్రజలతో పంచుకున్నారు. ‘జై భారత్‌. నా తోటి భారతీయులకు నమస్కారం. మీలో ఒక్కడినైనందుకు గర్వపడుతున్నాను. మన ప్రియతమ ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ అంటే  పాటించాం. లాక్‌డౌన్‌ అంటే లాక్‌ అయ్యాం. చప్పట్లు కొట్టమంటే కొట్టాం. దీపాలు వెలిగించమంటే వెలిగించాం. ఇది ఒక ఈవెంట్‌ కాదు.. మూవ్‌మెంట్‌. ఇది ప్రజల ఉద్యమం. మనం చేసింది, చేస్తోంది మోదీ కోసం కాదు.. మన కోసం.’ అని సాయి కుమార్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా: ఎట్టకేలకు బాలీవుడ్‌ గాయని డిశ్చార్జ్‌

8. ఆ లాక్‌డౌన్‌ తేదీల జాబితా అబద్ధం...

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా, భారత ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు ఈ నెల 14తో ముగుస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటనే విషయంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా విభాగం విడుదల చేసిందంటూ లాక్‌డౌన్‌ తేదీల జాబితా ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉంది. కొవిడ్‌-19 నివారణకు భారత్‌లో ఆరు అంచెల్లో లాక్‌డౌన్‌ అమలు జరుగుతుందంటూ ఈ ప్రకటన తెలియజేస్తోంది. కాగా ఈ సమాచారం అసత్యమని ప్రభుత్వ మీడియా సంస్థ ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’ (పీఐబీ) ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. OLXలో ఐక్యతా విగ్రహం అమ్మకానికి అంటూ.. 

కరోనా కట్టడి కోసం ఓ వైపు అధికార యంత్రాంగం నిరంతం శ్రమిస్తుంటే.. మరోవైపు ఆకతాయిల చేష్టలు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. కరోనాపై పోరాటానికి నిధుల కోసమంటూ పలువురు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటన ఉంచారు. ఆస్పత్రుల ఏర్పాటు, వైద్య పరికరాల కొనుగోళ్ల కోసం దీన్ని రూ.30,000 కోట్లకు విక్రయిస్తున్నామంటూ ఆకతాయిలు ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యతా విగ్రహం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS : దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.