close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. లాక్‌డౌన్‌ పొడిగించాలి: పలు రాష్ట్రాలు విజ్ఞప్తి

దేశంలో కరోనా కేసుల పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్‌ పొడిగించాలంటూ పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు అందుతున్నాయి. రాష్ట్రాల విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ గడువు ఏప్రిల్‌ 14తో ముగుస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాలతో పాటు నిపుణులు సైతం పొడిగించాలంటూ తమ అభిప్రాయాలు తెలపడంతో లాక్‌డౌన్‌ కొనసాగించాలా?ముగించాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘1092’కాల్స్‌ పరిష్కారంపై దృష్టిపెట్టాలి: జగన్‌

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం దిల్లీకి వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు సీఎంకు వివరించారు. అందరికీ వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. దానికి అనుగుణంగా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని..రెండు జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ కూడా ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సరిపడా టెస్టింగ్‌ కిట్లు తెప్పించుకోవాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మేం అమ్మితేనే మీకు ఔషధాలు: శశిథరూర్‌

కొవిడ్-19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల సరఫరా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ తీవ్రంగా పరిగణించారు. తమ విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే ప్రతీకారం ఉండొచ్చన్న ఆయన తీరును విమర్శించారు. ‘అంతర్జాతీయ వ్యవహారాలను కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నాను. కానీ ఈ తీరుగా ఏ దేశాధినేత మరొక దేశాన్ని భయపెట్టాలని ప్రయత్నించడం చూడలేదు. మిస్టర్‌ ప్రెసిడెంట్..  భారత్ మీకు వాటిని అమ్మాలనుకుంటేనే మీకు సరఫరా అవుతాయి’ అని ట్విటర్‌లో ఘాటుగానే స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* క్వారంటైన్‌లోకి ఉద్ధవ్‌ ఠాక్రే భద్రతా సిబ్బంది..!

4. మెడలో ఆభరణమైన కరోనా వైరస్‌

కరోనా వైరస్‌.. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందర్ని బాధితులుగా మార్చేస్తుంటే.. రష్యాలోని ఓ నగల వ్యాపారి ఆ వైరస్‌ ఆకృతిని ఆభరణంగా మార్చేసింది. ఆమె చేసిన ఆభరణానికి ఎంత ఆదరణ లభిస్తుందో.. విమర్శల వర్షం కూడా అంతే ఉంది. రష్యాకి చెందిన డాక్టర్‌ వొరొబెవ్‌.. ఓ ‘మెడికల్‌ జ్యువెలరీ ’నగల వ్యాపారి. మెడికల్‌ జ్యువెలరీ అంటే.. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారీ చేసే ఆభరణాలు. ఎక్కువగా వెండితో తయారు చేస్తారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది. అందుకే వైద్య రంగంలో పనిచేసేవారు ఈ మెడికల్‌ జ్యువెలరీని ధరిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 15లోగా ఆ ఆసుపత్రిని సిద్ధం చేయండి: కేటీఆర్‌

రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి  రాష్ట్రం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్‌ అథారిటీకి సబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రి పనులను ఇవాళ పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫేక్‌ న్యూస్‌: వాట్సాప్‌ అడ్మిన్‌లకు శిక్ష: నిజమెంత?

 కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దేశంలో నానాటికీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య, అబద్ధపు వార్తలు కరోనా వైరస్‌ కన్నా వేగంగా వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా కరోనాపై మీమీస్‌, జోక్స్‌, ఫేక్‌ న్యూస్‌ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక సందేశం చూసి వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లు వణికిపోతున్నారు. ఏదైనా గ్రూప్‌లో వాట్సాప్‌ ఫేక్‌న్యూస్‌ ఉన్నట్లు గుర్తిస్తే ఆ గ్రూప్‌ అడ్మిన్‌పై సెక్షన్‌ 68, 10, 188 కింద న్యాయపరమైన చర్యలు తప్పవని, అందుకు రెండు రోజుల పాటు వాట్సాప్‌ గ్రూప్‌ మూసేయాలని గత రెండు, మూడు రోజులుగా ఓ సందేశం వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీన్ని చూసి వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా వైరస్‌: నిజాముద్దీన్‌ నుంచి ధారావికి!

 మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వైరస్‌ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌ ఘటన అనంతరం రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 23కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 891కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 110 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అత్యంత జనసాంద్రత ఉండే ధారావి ప్రాంతంలో నమోదవుతున్న కేసుల సంఖ్య కలవరపెడుతోంది. ఈ ప్రాంతంలో తొలుత వైరస్‌ సోకి మరణించిన వ్యక్తినుంచి అతని తండ్రి, సోదరునికి కరోనా సోకినట్లు అధికారులు తాజాగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అసభ్యంగా ప్రవర్తించిన తబ్లిగీలపై కేసు!

8. ఆ ఉద్యోగాలను వెనక్కి తీసుకోవద్దు..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. విద్యార్థులకు ప్రాంగణ నియామకాల(క్యాంపస్‌ సెలక్షన్) ద్వారా ఇచ్చిన ఉద్యోగావకాశాలను వెనక్కి తీసుకోవద్దంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా సంస్థల యాజమాన్యాలను కోరింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎంలలో చదివిన విద్యార్థులు కొందరు కరోనా లాక్‌డౌన్‌ అనిశ్చితి కారణంగా ఉద్యోగావకాశాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.  రాజనే భయం లేదు.. పేదనే జాలి లేదు..!

కరోనాకు రాజు, పేద తేడా తెలియదు అని అంటున్నారు నటి మాధవీ లత. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను ఉద్దేశించి ఆమె టిక్‌టాక్‌ వీడియో చేశారు. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.‘మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను 4.4 లక్షల మందికిపైగా వీక్షించారు. 35 వేల మంది లైక్‌ చేశారు. ‘ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు, చాలా బాగా చెప్పారు, మీ కవిత చాలా బాగుంది..’ అని పలువురు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IN PICS : దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

10. కరోనాపై పోరు, ప్రధాని మోదీకి సోనియా లేఖ 

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనాపై మరింత సమర్థవంతంగా పోరు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రధాని మరింత కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా పార్లమెంట్‌ భవనంతోపాటు, సెంట్రల్‌ విస్టా, మంత్రులకు సంబంధించిన కాంపోజిట్ కాంప్లెక్స్ ఆధునీకరణ ప్రాజెక్టును నిలిపివేసి అందుకు కేటాయించిన రూ. 20 వేల కోట్ల నిధులను కరోనాపై పోరులో భాగంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్ల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.