
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. జిల్లాకో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి: జగన్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఆస్పత్రిలోనూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచాలని.. ప్రతి జిల్లాలో ఒక కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ‘రుజువు చేస్తా..అనర్హత వేటు వేయగలరా?’
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం చివరికి కరోనా వైరస్‌ను సైతం వదలడంలేదని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సాయాన్ని అధికారుల పర్యవేక్షణలో అందించాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల వైకాపా అభ్యర్థులు గుంపులుగా వెళ్లి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా సాయం పంపిణీ పేరుతో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలతో రుజువుచేస్తానని.. సీఎం జగన్ వారిపై అనర్హత వేటు వేయగలరా అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆర్థికసాయం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే:అంబటి
కరోనా వ్యాప్తితో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో పేదలకు నిత్యావసరాలతో పాటు రూ.వెయ్యి ఆర్థికసాయం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దీనిపైనా విమర్శలు సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయానికి సీఎం జగన్ స్టాంప్ వేసుకుని పంచుతున్నారంటూ భాజపా నేతలు చేస్తోన్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఆ నిధులు ప్రధాని మోదీ, జగన్‌వి కాదని.. ప్రజలవేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ప్రజలకు పంపిణీ చేస్తున్న రూ.వెయ్యి ఆర్థిక సాయం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే అని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్రభుత్వాలకు సహకరించాలి: కిషన్‌రెడ్డి
దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నింటిలో అత్యధిక శాతం కేసులు నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చివవారి వల్లే సంక్రమించడం ఆందోళనకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కుటుంబ సమేతంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో స్పందించకుండా ఉండడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక కుటుంబాలు వైరస్ బారిన పడ్డాయని.. ఇప్పటికైనా ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* వైద్యుల భద్రతకు వాట్సాప్ గ్రూపులు:డీజీపీ
5. అమెరికా దుస్థితికి అదే కారణమా?
కొవిడ్-19 వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రంలో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున శనివారం ఒక్కరోజే మొత్తం 630 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఒక్క అమెరికాలోనే కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. అమెరికాలో ప్రయాణాలపై ఆంక్షలు విధించకముందు లక్షల మంది చైనా నుంచి అగ్రరాజ్యానికి వచ్చినట్లు సమాచారం. సుమారు 4.30 లక్షల మంది చైనా నుంచి నేరుగా అమెరికాలోకి ప్రవేశించగా.. అందులో వుహాన్ నుంచి వచ్చిన వారి సంఖ్య వేలల్లో ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కరోనాపై గెలిచా.. మళ్లీ విధుల్లో చేరతా
వారంలోనే కరోనా వైరస్‌పై విజయం సాధించి, ఐసోలేషన్ నుంచి బయటకు వెళ్తానని శపథం చేసిన కేరళ నర్సు మాటలు నిజమయ్యాయి. గత నెలలో మహమ్మారి బారిన పడిన ఆమె తాజాగా కోలుకొని శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. హోమ్ క్వారంటైన్ తర్వాత మళ్లీ విధుల్లో చేరి కరోనా బాధితులకు సపర్యలు చేస్తానని అంటున్నారు. వివరాల్లోకెళితే.. కొట్టాయంకు చెందిన రేష్మ మోహన్‌దాస్ (32) కొట్టాయం మెడికల్ కళాశాలలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతనెల థామస్ అబ్రహం(93), మరియమ్మ(88) అనే వృద్ధ దంపతులు కరోనా బారినపడి ఇక్కడి ఐసోలేషన్ కేంద్రానికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఆస్పత్రిపై నుంచి దూకిన కరోనా అనుమానితుడు
కరోనా వైరస్ అనుమానితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దిల్లీలోని ఎయిమ్స్ జై ప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. భవనంపై నుంచి దూకడంతో అతడి కాలు విరిగింది. ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆదివారం ఉదయం మూడో అంతస్థు నుంచి దూకి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ వ్యక్తికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని, అతడి రిపోర్ట్లు రావాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* దక్షిణాఫ్రికాలో తబ్లిగీ జమాత్ వ్యక్తి మృతి
8. అమెరికా, ఇటలీ పరిస్థితి మనకొద్దు : మీనా
విదేశాల్లో పరిస్థితి భారత్‌కు రావొద్దంటే ప్రజలంతా ప్రభుత్వాలు చెప్పిన మాటలు వినాలని సినీ నటి మీనా కోరారు. ‘నమస్కారం. మన ప్రపంచాన్ని కరోనా వైరస్ (కొవిడ్-19) పీడిస్తోంది. ఈ మహమ్మారి కట్టడి కోసం.. మన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం ఎంతో బాధగా ఉంది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో తెలుసా? ఆయా దేశాల్లో ఒక రోజులోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో రెండున్నర లక్షల మందికిపైగా ఈ వైరస్‌తో ఇబ్బందిపడుతున్నారు.’ అని మీనా విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పరీక్షల సంఖ్యను పెంచాలి: ప్రియాంక గాంధీ
రోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు విధించిన లాక్డౌన్ సత్ఫలితాలివ్వాలంటే వైద్య పరీక్షల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రానికి సూచించారు. పరీక్షల సంఖ్య పెంచితేనే వైరస్ తీవ్రత ఎలా ఉందో.. ఎక్కడ కేంద్రీకృతమైందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి సరైన రక్షణ సదుపాయాలు అందడం లేదని ఆరోపించారు. ఈ సమయంలో వైద్య సిబ్బందికి అన్నిరకాల సదుపాయాలు అందించడం తప్పనిసరి అని గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. కాబూల్ గురుద్వారా దాడి సూత్రధారి అరెస్ట్!
అఫ్గానిస్థాన్‌లో సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారాపై ఇటీవల జరిపిన దాడిలో సూత్రధారిగా భావిస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్లా ఒరఖ్‌జాయ్ అలియాస్ అస్లాం ఫరూకీని అఫ్గాన్ నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ఇతడికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఐసిస్‌లోని ఖొరాసన్ విభాగానికి అబ్దుల్లా ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నాడు. అఫ్గాన్ దక్షిణ ప్రాంతంలోని కాందహార్ ప్రావిన్సులో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) జరిపిన ఓ ఆపరేషన్‌లో శనివారం ఇతడు పట్టుబడ్డట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ ‘టోలో న్యూస్’ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
