close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 29/03/2020 21:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా ఫ్రీ తెలంగాణ: కేసీఆర్‌

రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని, కేంద్రం కూడా విమానాశ్రయాలు, పోర్టులన్నీ మూసివేసిందని తెలిపారు. అందువల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని సీఎం అన్నారు. రాష్ట్రంలోనూ కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని చెప్పారు.  చికిత్స పొందిన 11మంది కరోనా బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 11 మంది కరోనా నుంచి కోలుకున్నారు: కేటీఆర్‌

2. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు @31వేలు

రోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో మూడింట రెండొంతుల మరణాలు ఒక్క యూరప్‌ ఖండంలో సంభవించడం అక్కడి ఈ వైరస్‌ విజృంభణకు అద్దం పడుతోంది. చైనాలోని వుహాన్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ 183 దేశాలకు వ్యాప్తించగా.. సుమారు 6,67,090మంది దీని బారిన పడ్డట్లు ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ అసోసియేట్‌ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ) వెల్లండించింది. అదే సమయంలో 1,34,700 మంది కోలుకున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గ్రామ వాలంటీర్లు సమర్థంగా పనిచేయాలి: పవన్‌

కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్లు విజయవంతం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ‘ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కొన్ని వేల మంది జనం బయటికి వచ్చి రేషన్‌ షాపుల ముందు క్యూలో నిలబడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఇంటికి రేషన్‌ సరకులు మేమిస్తామని, నిత్యావసర వస్తువులు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చింది.’ అని పవన్‌ పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వలస కూలీలను ఆదుకోండి: వెంకయ్యనాయుడు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతమవుతున్న నేపథ్యంలో వివిధ చోట్ల చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకోవాలని స్వచ్ఛంద, సామాజిక సంస్థలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికీ వెళ్లలేక.. కనీస భోజన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. వలస కార్మికుల విషయంలోనూ స్థానికులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి కూడు, గూడు కల్పించి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో మరో 3 ప్రైవేటు ల్యాబ్‌లు

 కరోనా (కొవిడ్‌-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణలో మూడు ప్రైవేటు ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ల్యాబ్‌ల సంఖ్య పెంచామని, మొత్తం 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతిచ్చామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్) ఇవాళ ప్రకటించింది. ఇందులో కొత్తగా తెలంగాణలో మూడు ఉన్నాయి. ఇప్పటికే ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐసోలేషన్‌ వార్డుల్లో సేవలు అద్భుతం

కేరళలో కరోనావైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించే కేంద్రాల్లో వైద్య సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని కేరళ దంపతులు అంటున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన రాబిన్‌ దంపతులకు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన వారి అత్తమామల ద్వారా కరోనా వైరస్‌ సోకింది. దీంతో వారితో పాటు రాబిన్‌ దంపతులు అక్కడే ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో చేరారు. 21 రోజులపాటు అక్కడే ఉన్న వారు  కరోనా నుంచి పూర్తిగా కోలుకుని మార్చి 25 తేదిన ఇంటికి చేరారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రికార్డు స్థాయిలో ఎగిరిపోయాయి..  

మార్కెట్ల నుంచి మార్చి నెలలో రూ.1.2లక్షల కోట్లను విదేశీ సంస్థాగత మదుపరులు వాపస్‌ తీసుకొన్నారు. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకొంటుందనే భయంతో చాలా మంది తమ సొమ్మును తీసేసుకొన్నారు. డిపాజిటర్స్‌ డేటాను పరిశీలిస్తే నికరంగా రూ.59,377 కోట్లను ఈక్విటీ మార్కెట్ల నుంచి వాపస్‌ తీసుకోగా.. రూ.52,811 కోట్లను రుణ మార్కెట్ల నుంచి వాపస్‌ తీసుకొన్నారు. మార్చి 2వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో కాలంలో ఈ సొమ్మను తీసుకొన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. దీంతో మార్కెట్ల నుంచి వెళ్లిపోయిన మొత్తం రూ.1,12,188 కోట్లకు చేరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లాక్‌డౌన్‌ వేళ..డీఎస్పీగా టీమిండియా క్రికెటర్‌

2007 టీ20 ప్రపంచకప్‌ హీరో జోగిందర్‌ శర్మను ఐసీసీ శనివారం కీర్తించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19)ను నివారించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జోగిందర్‌ పోలీస్‌ అధికారిగా దేశ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. క్రికెట్‌ కెరీర్‌ అనంతరం హరియాణాలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయన తాజాగా లాక్‌డౌన్‌ సందర్భంలోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ఫొటోను ఐసీసీ ట్విటర్‌లో అభిమానులతో పంచుకోవడంతో జోగిందర్‌ అసలైన హీరో అంటూ నెటిజెన్లు కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అయ్యో..! అతని గుండె ఆగిపోయింది..!

 పొట్టకూటి కోసం ఊరు కాని ఊరు వచ్చాడు. కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు. దేశ రాజధాని చేరుకుని ఓ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా జీవితం మొదలు పెట్టాడు. ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపుతున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. అయితే, కాలం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా.. పరీక్షిస్తుందో తెలియదు కదా. దేశాన్ని కరోనా కారు మేఘాలు కమ్ముతున్న వేళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో సొంతూరు చేరుకునేందుకు రవాణా లేక నడిచి ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. అడుగులో అడుగు వేసుకుంటూ కంటితో దూరాన్ని, కాళ్లతో కాలాన్ని కరిగించాలనుకున్నాడు. అయితే, తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రానా-త్రిష-బన్నీ వీడియో కాలింగ్‌

స్నేహితులు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌ తనకు కంపెనీ ఇచ్చారని కథానాయిక త్రిష చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. షూటింగ్‌లు కూడా ఆగిపోవడంతో సినీ ప్రముఖులు సైతం ఇంటికే పరిమితమయ్యారు. కాగా తనకు రానా, బన్నీ కంపెనీ ఇచ్చారని త్రిష ఓ పోస్ట్‌ చేశారు. వీడియో కాల్‌లో ముచ్చట్లు చెప్పుకున్నామని తెలుపుతూ స్క్రీన్‌ షాట్‌ను ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తోనూ త్రిష వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.