close

తాజా వార్తలు

Updated : 14/10/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. గ్రౌండ్‌ రిపోర్టు

కుంభవృష్టి వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. చెరువులు, కుంటలు పొంగి నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. నగరంలోని దాదాపు 1500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు కోతకుగురవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* హైదరాబాద్‌లో వర్ష బీభత్సానికి సజీవ సాక్ష్యాలు

2. కొవిడ్‌ టీకాల రెండోదశ ఫలితాలు ఎప్పుడంటే?

కరోనా వైరస్‌పై పోరాటానికి భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రెండు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. ఈ టీకాల తొలి దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్ల రెండో దశ ఫలితాలు నవంబరు తొలివారంలో వస్తాయని తెలిసింది. భారత వైద్య పరిశోధన మండలి ‌(ఐసీఎమ్‌ఆర్‌)తో కలిసి భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ఈ కరోనా వ్యాక్సిన్లు వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే కేంద్ర వైద్యశాఖ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తలసరి జీడీపీలో బంగ్లాదేశ్ దిగువకు భారత్‌!

తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరంగా ఈ ఏడాది భారత్‌ను బంగ్లాదేశ్‌ దాటనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10.3 శాతం కుచించుకుపోనుందని తెలిపింది. ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్’ పేరుతో మంగళవారం ఐఎంఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. డ్రైవర్‌ లేడు.. కారెవరు నడుపుతున్నారబ్బా!?

డ్రైవర్‌ సీట్లో ఎవరూ లేకుండానే ఓ కారు రహదారిపై దూసుకుపోతున్నట్లు ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. డ్రైవర్‌ పక్క సీట్లో ఓ వ్యక్తి దర్జాగా కూర్చొని ఉండగా.. డ్రైవర్‌లేని ఆ పాత కారు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతుండటం నెటిజన్లను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇప్పుడు నేనొక ‘సూపర్‌ మ్యాన్’: ట్రంప్

ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చే రీతిలో కరోనావైరస్‌కు చికిత్స పొంది కోలుకున్నట్లు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఇప్పుడు తనకు తాను సూపర్ మ్యాన్‌తో పోల్చుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు, తన రోగనిరోధక శక్తి గురించి గొప్పగా చెప్పుకున్నారు. ‘నేను ఏదో తీసుకున్నాను. అది ఏదైనా కావొచ్చు. కానీ, నేను త్వరగా కోలుకున్నా. నాకు నేను సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తోంది. మన వద్ద గొప్ప వైద్యులు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రజనీకాంత్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ విధించిన పన్నును సవాల్‌ చేస్తూ రజనీ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపం రజనీకాంత్ పేరిట ఉంది. లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఈ కల్యాణ మండపాన్ని మూసేశారు. 2020 మార్చి 24 నుంచి అందులో వేడుకలు జరగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హాథ్రస్‌ బాధితురాలి తండ్రి, సోదరులకు సమన్లు

యూపీలోని హాథ్రస్‌లో గ్యాంగ్‌రేప్‌, హత్యకు గురైన దళిత యువతి తండ్రి, సోదరులకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం వారిని విచారించిన దర్యాప్తు సంస్థ.. బుధవారం మరోసారి ప్రశ్నించనుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకుంటున్న సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అంజలి గాంగ్వర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. యువతి కుటుంబ సభ్యుల్లోని మగవారిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సీబీఐ కార్యాలయంలో రెండో రోజు విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హాథ్రస్‌లో మరో ఘోరం: నాలుగేళ్ల చిన్నారిపై..

8. మార్కెట్‌లోకి హోండా అమేజ్‌ స్పెషల్‌ ఎడిషన్‌

హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) తన కొత్త కారును బుధవారం లాంచ్‌ చేసింది. అమేజ్‌ ‘స్పెషల్‌ ఎడిషన్‌’ పేరిట తీసుకొస్తున్న ఈ కారును రానున్న పండుగ సీజన్‌లో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఎంటీ, సీవీటీ వేరియంట్లలో పెట్రోల్‌, డీజిల్‌ ఆప్షన్లతో ఈ కారు వస్తోంది. స్పెషల్‌ ఎడిషన్‌లో అద్భుతమైన, కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చినట్లు హోండా వెల్లడించింది. అమేజ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.7లక్షలు కాగా.. డీజిల్‌ వెర్షన్‌ ధర రూ.8.30 నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఆ చోటుకు రమ్మన్నాడు.. నేను షాకయ్యా!’

ప్రముఖ గాయని చిన్మయి.. సాహిత్య రచయిత వైరముత్తుపై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. చిత్ర పరిశ్రమలో, వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ‘మీటూ’ ఉద్యమం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో చిన్మయి తొలిసారి వైరముత్తుపై ఆరోపణలు చేశారు. ఓ కాన్సర్ట్‌ కోసం విదేశానికి వెళ్లినప్పుడు తనను గదికి రమ్మని వైరముత్తు వేరొకరితో చెప్పి పంపాడని ఆమె అనడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అవును, ఇది 2020.. అసలు ఊహించలేం!

లీగ్‌ ఆరంభానికి ముందు ప్రతిసారి.. ‘‘ఈ సాలా కప్ నమదే నినాదంతో బరిలోకి దిగడం..మెరుగ్గా రాణించి ట్రోఫీ సాధిస్తారునుకోవడం.. అంచనాలు అందుకోలేక చతికిలపడటం.. అభిమానులు నిరాశచెందడం..’’ గత సీజన్లలో కోహ్లీసేన పరిస్థితి ఇది. కానీ ఈ సీజన్‌లో మురిపిస్తోంది. ఆల్‌రౌండర్‌ షోతో మైమరిపిస్తోంది. అవును ఇది 2020 కదా! ఊహించినది జరగదని మరోసారి నిరూపిస్తోంది. గతంలో ఒకరిద్దరి ప్లేయర్ల మీద ఆధారపడిన జట్టు సమష్టి విజయాలు సాధిస్తోంది. ఒక్కప్పుడు బలహీనతగా మారిన ఆ జట్టు బౌలర్లే ఇప్పుడు మ్యాచ్‌ విజేతలు అవుతున్నారు. కోహ్లీసేనలో ఈ అనుహ్య మార్పులకు కారణాలేంటి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.