close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 02/06/2020 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు:చంద్రబాబు

వైకాపా చేతకాని పాలనతో దేశవిదేశాల్లోని తెలుగువారు నవ్వులపాలయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘నవ్వులపాలైన తెలుగువారు’ పేరిట ట్విటర్‌లో ఆయన వీడియో విడుదల చేశారు. ప్రభుత్వం చేస్తున్న దౌర్జర్యాలు చూసి ‘బిహార్‌ ఆఫ్‌ సౌత్‌’, ‘గవర్నమెంట్‌ టెర్రరిజం’ అంటూ అవమానించే పరిస్థితి వచ్చిందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ రద్దు, మూడు రాజధానులు, శాసన మండలి రద్దు వంటి చర్యలతో రివర్స్‌ పాలన, తుగ్లక్‌ 2.0 అని అంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇళ్ల స్థలం వద్దే పట్టాల పంపిణీ:జగన్‌

పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జులై 8న పట్టాలు అందజేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్ల స్థలాలపై మంత్రి శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, ఇతర ఉన్నతాధికారులతో పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 3,38,144 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఉన్న రూ. 1,323 కోట్లు పాత బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చెల్లింపులు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో జూన్‌8 నుంచి హోటళ్లకు అనుమతి

ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించి హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతులు ఉంటాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రకటించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... కొవిడ్‌-19 నియమ నిబంధనలకు అనుగుణంగా పలు సూచనలతో హోటళ్లను నడిపే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. హోటళ్లను పునః ప్రారంభించడంపై ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర హోటల్‌ సమాఖ్యతో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తేమ తగ్గితే కరోనా కాటు!

వాతావరణంలోని తేమకు, కరోనా వ్యాప్తికి లంకె ఉందంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. వాతావరణంలోని తేమ ఒక శాతం తగ్గినప్పుడు కొవిడ్‌-19 కేసులు ఆరు శాతం మేర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక వాతావరణం కరోనా వైరస్‌ వ్యాప్తికి ఎలా కారణమవుతుందనే  అంశంపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ట్రాన్స్‌బౌండరీ అండ్‌ ఎమర్జింగ్‌ డిసీజెస్‌ అనే జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. దక్షిణార్థగోళంలో వైరస్‌కు, వాతావరణానికి గల సంబంధాన్ని ఇందులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. క్వారంటైన్‌ పూర్తయిన వారికి కండోమ్స్‌!

అవాంఛిత గర్భాల నిరోధానికి బిహార్‌ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. 14 రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళుతున్న వలస కూలీలకు కండోమ్‌లను పంపిణీ చేస్తోంది. అలాగే, హోంక్వారంటైన్‌లో ఉన్న వాళ్లకు సైతం వీటిని అందజేస్తోంది. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్న వారికి పూర్తిగా కౌన్సెలింగ్‌ ఇచ్చి, కండోమ్స్‌, ఇతర గర్భ నిరోధక ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని వైద్యశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అవాంఛిత గర్భాలను నిరోధించడం, జనాభా నియంత్రణ ప్రక్రియలో భాగంగా ఇది చేపడుతున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శాంసంగ్‌ నుంచి రెండు బడ్జెట్‌ ఫోన్లు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌.. భారత్‌లో కొత్తగా రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ M11, గెలాక్సీ M01 పేరిట ఈ ఫోన్లను తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో దూసుకెళ్తున్న చైనా కంపెనీలకు పోటీగా శాంసంగ్‌ ఈ రెండు ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లు ఏంటి? ధరెంత? వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. WHO+చైనా: ట్రంప్‌ చెప్పిందే పచ్చి నిజం!

తరిచి చూస్తే అగ్రరాజ్యం అధ్యక్షుడి మాటలే నిజమని తెలుస్తోంది. కొవిడ్‌-19 వైరస్‌ జన్యుపరివర్తన క్రమాన్ని చైనా దురుద్దేశ పూర్వకంగానే ఆలస్యంగా బహిర్గతం చేసిందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ చైనా గొప్ప, చైనా సత్వరమే స్పందించింది, వేగంగా వివరాలను పంచుకుందని బాకా ఊదిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులే అదంతా నిజం కాదని చెప్పినట్టు అసోసియేట్‌ ప్రెస్‌ (ఏపీ) సంచలన విషయాలను బయటపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముంబయికి ‘నిసర్గ’ ముప్పు!

 ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిపైకి తుపాను రూపంలో మరో ముప్పు దాడికి సిద్ధమైంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను వేగంగా దూసుకొస్తోంది. రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ మధ్య హరిహరేశ్వర్‌, దామన్‌ మధ్య బుధవారం మధ్యాహ్నం ఇది తీరం దాటనుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘మహానటి’ చేతి దోశ: జక్కన్న ఏం చేస్తున్నారు?

‘మహానటి’ చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్న కథానాయిక కీర్తి సురేశ్‌ లాక్‌డౌన్‌లో గరిట తిప్పుతున్నారు. స్వయంగా చాక్లెట్‌ దోశ పోశారు. ఈ వీడియోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. క్వారంటైన్‌లో వంటలు చేస్తున్నానని తెలిపారు. మరోపక్క ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన పెంపుడు కుక్క సిద్ధకు ఓపిక ఎక్కువని కితాబిచ్చారు. దాంతోపాటు ఉన్న ఫొటోల కొలేజ్‌ పంచుకుంటూ.. ‘సిద్ధ నుంచి సహనంగా ఉండటం నేర్చుకోవాలి. నేను అతని చుట్టూ ఈ వృత్తాలు గీస్తున్నంతసేపు.. దాదాపు అరగంట అలానే పడుకున్నాడు..’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద బారులు తీరిన ప్రయాణికులు ఎండ నుంచి తప్పించుకునేందుకు భౌతిక దూరం కోసం గీసిన వృత్తాల్లో సామన్లు ఉంచి సమీపంలోని నీడలో నిల్చున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.