close

తాజా వార్తలు

Published : 19/09/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. అమెరికాపై చర్యలు తప్పవు..చైనా

చైనా తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న అమెరికా చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా కంపెనీలపై ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై డ్రాగన్‌ మండిపడుతోంది. తాజాగా టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటనపై చైనా వాణిజ్యశాఖ స్పందించింది. చైనా సంస్థలపై చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఆధారాలున్నాయి.. రాజీనామా చేయండి’

బెంజికారు ముమ్మాటికీ ఈఎస్‌ఐ నిందితుడు ఇచ్చిన లంచమేనని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇందులో మరో మాటకు తావులేదంటూ మరిన్ని ఆధారాలు బయటపెట్టారు. కారులో తిరుగుతున్న మంత్రి జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్‌ కు సంబంధించిన వీడియో ఫుటేజిని మీడియాకు విడుదల చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... జులై 26 నుంచి ఈశ్వర్‌ అదే బెంజికారు వినియోగిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని అవసరమైనప్పుడు వెల్లడిస్తానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 9 మంది అల్‌ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరినీ పశ్చిమబంగాల్‌లోని ముర్షీదాబాద్‌, కేరళలోని ఎర్నాకుళంలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ముర్షీదాబాద్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఎర్నాకుళంకు చెందిన వారని ఎన్‌ఐఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జనసమ్మర్థ ప్రదేశాల్లో బాంబు దాడులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సినిమాని తలపిస్తున్న పిల్లల ఫైట్‌..!

సమాజంపై సినిమాల ప్రభావం అధికంగా ఉంటుంది. పిల్లలపై ఇంకాస్తా ఎక్కువే. సోషల్‌మీడియా పుణ్యమా అని చాలామంది చిన్నారులు తమలోని యాక్టింగ్‌ టాలెంట్‌ను బయటపెట్టి వెలుగులోకి వస్తున్నారు. ఇదే మాదిరిగా కొంతమంది చిన్నారులు రూపొందించిన వీడియోలు తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా సదరు చిన్నారుల టాలెంట్‌ చూసి సినీ ప్రముఖులు సైతం ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 24గంటల్లో 93వేల కేసులు, 1247 మరణాలు!

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ నిత్యం కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 95వేల మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీగా పాజిటివ్‌ కేసులు భారీస్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,81,911 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 93,337 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆహారంతో వ్యాప్తి..ఆధారాల్లేవ్!

6. సుశాంత్‌తో కృతిసనన్‌ డేటింగ్..!

యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌తో కృతిసనన్‌ ఒకానొక సమయంలో డేటింగ్‌లో ఉన్నారని నటి లిజా మాలిక్‌ వెల్లడించారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్‌ వ్యక్తిగత జీవితం గురించి బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను సహనటీనటులు, స్నేహితులు, సన్నిహితులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ స్నేహితురాలు, ఆప్తురాలైన నటి లిజా మాలిక్‌ ఆయనకి సంబంధించిన కొన్ని కొత్త విషయాలను ఓ ఆంగ్లపత్రికతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసులో అది సాధ్యం కాదు

పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి  కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసుకు సంబంధించి భారత్‌ విజ్ఞప్తిని ఆ దేశం మరోసారి తిరస్కరించింది.  యాదవ్‌ తరపున వాదించేందుకు భారతీయ న్యాయవాదిని లేదా క్వీన్‌ కౌన్సిల్‌ను అనుమతించాలన్న భారత్‌ డిమాండు ఆచరణలో సాధ్యం కాదని ఆ దేశం చెబుతోంది. పాకిస్థాన్‌కు చెందని న్యాయవాదిని యాదవ్‌ తరపున వాదించేందుకు అంగీకరించాలంటూ భారత్‌ కోరుతోందని పాక్‌ అధికార ప్రతినిధి జహీద్‌ హఫీజ్‌ చౌదరి మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏప్రిల్‌ నాటికి అందరికీ వ్యాక్సిన్‌: ట్రంప్‌

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరులందరికీ సరిపడా వ్యాక్సిన్‌ డోసులు ఏప్రిల్‌ 2021 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ‘‘వ్యాక్సిన్‌కు అనుమతులు లభించిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తాం. ఏప్రిల్‌ 2021 నాటికి అందరికీ సరిపడా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాం’’ అని శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘సోనమ్‌ నీ భర్త ఏ మాత్రం బాగోడు..!’

తన భర్త అందంగా ఉండడని కామెంట్‌ చేసిన అమెరికన్‌ సోషల్‌ మీడియా ఇన్ఫుఎన్సర్‌కు కథానాయిక సోనమ్‌ కపూర్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఫాలోవర్స్‌‌ను పెంచుకోవడం కోసం ఈ ట్రిక్కు వాడుతున్నావంటూ మండిపడ్డారు. ప్రేమను పంచమని, ద్వేషాన్ని కాదని సదరు మహిళ పెట్టిన సందేశాలు షేర్‌ చేశారు. ‘నువ్వు ఈ మెసేజ్‌ చదవవని నాకు తెలుసు. నువ్వు తప్పుడు ఆరోపణల గురించి, మహిళా సాధికారిత గురించి మాత్రమే మాట్లాడుతావు. నీలాంటి మహిళ సమాజంలో నెగిటివిటీని వ్యాప్తి చేస్తుంది. మీ నాన్న లేకపోతే నువ్వు శూన్యం’ అని మహిళ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆరంభ పోరులో గెలుపెవరిది?

పొట్టి క్రికెట్‌ వేడుకకు వేళైంది. ఆరంభ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు అబుదాబి ముస్తాబైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి, రన్నరప్‌ చెన్నై వీనులవిందైన ఆటతో అభిమానుల మనసుల్ని పసందు చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లుచెదిరే సిక్సర్లు.. వికెట్లను ఎగరగొట్టే బంతులతో రంజింపచేసేందుకు ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. తొలి సమరంలో బాహాబాహీకి దిగుతున్న రెండు జట్ల బలాబలాలేంటో తెలుసుకుందాం పదండి మరి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.