close

తాజా వార్తలు

Published : 20/09/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. టిక్‌టాక్‌ ఇకపై టిక్‌టాక్‌ గ్లోబల్‌గా..

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని వారంపాటు వాయిదా వేశారు. ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాప్‌ కార్యకలాపాలు కొనసాగేలా అమెరికన్‌ కంపెనీలతో కలిసి టిక్‌టాక్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌, ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ కలిసి అమెరికాలో యాప్‌ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏర్పాటు చేయబోయే కొత్త కంపెనీకి శ్వేతసౌధం సహకారం ఉంటుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత్‌: 54లక్షలు దాటిన కొవిడ్‌ కేసులు!

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీగా భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా మరో 94వేల మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 12,06,806 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 92,605 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

3. ట్రంప్‌నకు విషంతో కూడిన పార్శిల్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన ఓ పార్శిల్‌ను వైట్‌ హౌస్‌ చిరునామాతో పంపారు. దీన్ని తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన అధికారులు అక్కడే నిలిపివేశారు. ప్రాథమిక నిర్ధారణ పరీక్షల్లో అది రిసిన్‌ అనే విషపదార్థం అని తేలినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అనుమానిత కవర్‌ ఒకటి ట్రంప్‌ పేరిట వచ్చిందని.. దానిపై దర్యాప్తు కొనసాగుతుందని మాత్రం దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ బిల్లుతో రైతులకు తీరని నష్టం: కేకే

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదముందని తెరాస ఎంపీ కె.కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో వ్యవసాయ అనుబంధ బిల్లులపై చర్చ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ... మార్కెటింగ్‌ ఏజెంట్లకు కూడా నష్టం చేసేలా కొత్త చట్టం ఉందన్నారు. వ్యవసాయంలో కూడా కార్పొరేట్లను పెంచి పోషించేలా ఉందని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్ర వ్యవసాయ బిల్లుకు వైకాపా మద్దతు

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. నచ్చినచోట పంట అమ్ముకోవడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏపీలో రైతు భరోసా పథకం ద్వారా సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మెరుపువేగంతో వెళ్లే టాప్‌ బుల్లెట్‌ రైళ్లు ఇవీ..!

తక్కువ ఛార్జీతో సౌకర్యవంతంగా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు. దేశంలోనే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేస్‌కు పేరుంది. కొంతకాలం కిందట ‘వందే భారత్‌’ పేరుతో అత్యంత వేగవంతమైన రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలు గంటకు 180కి.మీ(సర్వీసులో మాత్రం గంటకు 130కి.మీ)వేగంతో ప్రయాణిస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర భావిస్తోంది. గంటకు వందల కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గిపోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెరచుకోనున్న కరోనా హాట్‌స్పాట్‌ మార్కెట్

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన కోయంబేడు మార్కెట్‌ మళ్లీ తెరచుకోనుంది. ఈ నెల 28 నుంచి షాపులు తెరచేందుకు అధికారులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. ఈ మార్కెట్లో దాదాపు 3000 వరకు దుకాణాలు ఉండగా... తొలివిడతలో 300 దుకాణాలు తెరుస్తారు. విడతల వారీగా తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ప్రభావానికి ముందు కనీసం రోజుకు లక్ష మంది ఈ మార్కెట్‌కు వచ్చేవారు. ఈ మార్కెట్‌ కారణంగా దాదాపు 3,000 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు అంచనా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నీటి కుంటలో జారి పడిన ఏనుగు పిల్ల!

9. అనురాగ్‌ కశ్యప్‌ నా దుస్తులు విప్పబోయాడు

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి పాయల్‌ ఘోష్‌ ఆరోపించారు. సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి అనంతరం బాలీవుడ్‌లోని డ్రగ్స్‌ వ్యవహారం బయటకు రావడంతో ప్రతిఒక్కరి దృష్టి సదరు ఇండస్ట్రీపైనే పడింది. ఈ నేపథ్యంలో తాజాగా నటి పాయల్‌ఘోష్‌ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. అనంతరం దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించారని తెలియచేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పాయల్‌ ఆరోపణలు నిరాధారమైనవి: అనురాగ్‌

10. ధోనీ సర్‌.. ధోనీ అంతే  

చెన్నై జట్టు.. దాదాపు ప్రతి సీజన్‌లోనూ తానే టోర్నీని ప్రారంభిస్తుంది. ఇదొక్క విషయం చాలు ఐపీఎల్‌లో ఆ జట్టు ఎంత ప్రమాదకారో చెప్పడానికి. అవును, టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆడాలంటే మాటలా..? అలా జరగాలంటే గత ఏడాది ట్రోఫీ కొట్టైనా ఉండాలి. లేదా ఫైనల్‌కైనా చేరి ఉండాలి. చెన్నై తన ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తుంది.. కానీ టోర్నీ ప్రారంభంలోనే కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైతే.. దెబ్బమీద దెబ్బ పడుతుంటే.. ఏ జట్టైనా నిలబడుతుందా..? తలబడుతుందా..? నిజానికి ఏ కెప్టెన్‌కైనా తడబాటు తప్పదు. కానీ, అక్కడున్నది ధోనీ.. తడబాటంటే తెలియని మిస్టర్‌ కూల్‌. అందుకే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.