close

తాజా వార్తలు

Published : 11/10/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ‘అమెరికా శక్తితో చైనా వైరస్‌ను తుడిచిపెట్టేస్తాం’

అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞాన శక్తితో ‘చైనా వైరస్‌’ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనకోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స అనంతరం ట్రంప్‌ తొలిసారి శనివారం ప్రజల ముందుకు వచ్చారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సౌత్‌ లాన్‌లోని వైట్‌ హౌస్‌ బాల్కనీలో నిలబడే ట్రంప్‌ మాట్లాడారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ బాధితురాలు ఎవరికీ ఏమీ కాదు?

దళితులు, ముస్లింలు, ఆదివాసీలను దేశంలో చాలా మంది మనుషులుగా పరిగణించడం లేదని.. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. హాథ్రస్‌ హత్యాచార ఘటనను ఉద్దేశించి తాజాగా ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. ఎవరూ అత్యాచారానికి గురికాలేదని యూపీ సీఎం, అక్కడి పోలీసులు పదే పదే అంటున్నారని ఆరోపించారు. అంటే ఆ బాధితురాలు వారికి ‘ఎవరూ కాదు’ అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా వారు ఆమెను లేక్కే చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షల మార్కును దాటేసింది. శనివారం 10,78,544 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 74,383 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70,53,807కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా మహమ్మారితో 918 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,08,334కి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమరావతికి మద్దతుగా ర్యాలీలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులవుతున్న సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌టీసీ రోడ్‌లోని శారదా కళాశాల నుంచి ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఈ ప్రదర్శనలో రాజకీయ, ప్రజాసంఘాల నాయకులతో పాటు పెద్ద ఎత్తున రైతులు  పాల్గొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎట్టకేలకు చిరుత చిక్కింది

రాజేంద్రనగర్‌, శంషాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో  ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. గత కొన్ని నెలలుగా ఇక్కడే సంచరిస్తూ దాడులకు పాల్పడుతోంది. నిన్న రాజేంద్రనగర్‌లోని వాలంతరి ఆవరణలో ఓ పశువుల పాకలో ఆవు దూడలపై దాడి చేసి రెండు దూడలను చంపేసింది.  తెల్లవారుజామున పాక వద్దకు వచ్చిన యజమాని బాబా చనిపోయిన దూడలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫ్లాష్‌బ్యాక్‌: 10 వేల ప్రాణాలు బలిగొన్న మద్యనిషేధం!

కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బదులు శానిటైజర్లు తాగి 13 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. మద్యనిషేధంలో భాగంగా ధరలు భారీగా పెంచడంతో కొనలేని పరిస్థితుల్లో కొందరు, మద్యం లభించక కొందరు శానిటైజర్లు తాగడం మొదలుపెట్టారు. శానిటైజర్లను ఇథైల్‌ ఆల్కహాల్‌ తదితర రసాయనాలతో తయారు చేస్తారు. ఇందులోనూ ఆల్కహాలే కదా ఉందని తాగేశారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలాంటి ఘటనే ఓ సారి అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎక్స్‌షోరూం.. ఆన్‌రోడ్‌ ధరకు ఏంటి తేడా..?

బైక్‌ గురించో, కారు గురించో ప్రకటన చూసి ధర తక్కువని మురిసిపోతాం. తీరా డీలరు దగ్గరికెళ్లాక రేటు విని నోరెళ్లబెడతాం. అప్పుడుగానీ తెలియదు మనకు ఎక్స్‌ షోరూంకి.. ఆన్‌రోడ్‌కి ఉన్న తేడా. అది నమ్మాలా? వద్దా? అని చాలామందికి సంశయం. మోసపోతున్నామేమోనన్న సందేహం. ఇంతకీ ఏది వాస్తవం? ఎందుకీ తేడాలు? ఈ అంకెల వెనుక ఉన్న మర్మమేంటి? కొనేటప్పుడు బేరమాడడానికి ఉన్న అవకాశాలేంటి? కొనడానికి వెళ్లేముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గూగుల్‌ ఫొటోస్‌లో ఎడిటర్‌ ఫీచర్‌

ఎంత మంచి కెమెరాతో ఫొటో తీసినా అవి మరింత అందంగా కనిపించేందుకు కలర్‌, కాంట్రాస్ట్‌ ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న మార్పులు చేస్తాం. అయితే మొబైల్‌ ఫోన్లలో అధిక పిక్సెల్‌ సామర్థ్యంతో కెమెరాలు వచ్చాక ఫొటోల కోసం ప్రత్యేకంగా కెమెరాలు ఉపయోగించడం తగ్గింది. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కూడా వినియోగదారుల కోసం మొబైల్‌ కెమెరాల్లోనే ఎడిటింగ్ ఫీచర్స్‌ ఇస్తుండడంతో క్షణాల్లో అందమైన ఫొటోలు సిద్ధమైపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ కూడా ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ కోసం కొత్తగా గూగుల్ ఫొటోస్‌ యాప్‌లో ఎడిట్‌ ఫీచర్‌ని తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాఫియా గ్యాంగ్‌ నన్ను చంపేస్తారు..!

మాఫియా గ్యాంగ్‌ తనని చంపేస్తారని.. కాబట్టి దయచేసి తనకి సాయం చేయమని కోరుతూ నటి పాయల్‌ ఘోష్.. ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ పాయల్‌ ఇటీవల ముంబయిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘నాతో రిచా చద్దా అత్యంత సన్నిహితంగా ఉంటుంది’ అని అనురాగ్‌ తనతో చెప్పారని నటి పాయల్‌ సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కోల్‌కతాకు షాక్‌.. నరైన్‌పై ఫిర్యాదు

కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. శనివారం రాత్రి పంజాబ్‌, కోల్‌కతా జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ గఫెనీ, ఉల్హాస్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నరైన్‌ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నాం. ప్రస్తుతం అతను బౌలింగ్‌ వేయవచ్చు. మరోసారి ఫిర్యాదు వస్తే మాత్రం బీసీసీఐ నుంచి క్లియరెన్స్‌ వచ్చే వరకు నరైన్‌ బౌలింగ్‌ వేసే అవకాశం ఉండదు’ అని ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.