close

తాజా వార్తలు

Published : 16/10/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. వారిపై రెమ్‌డెసివిర్‌ పనిచేయట్లేదు:WHO

కరోనా వైరస్‌ తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగులపై గిలిద్‌ సైన్సెస్‌‌కు చెందిన యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ ఎటువంటి ప్రభావం చూపించడం లేదని గుర్తించినట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఆసుపత్రిలో బాధితులు కోలుకునే సమయాన్ని తగ్గించడంలో, మరణం నుంచి బయటపడేయడానికి ఈ మందు దోహదం చేయడం లేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం

విజయవాడకు మకుటాయమానంగా నిలవనున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం జగన్‌ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనితో పాటు రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు 16 వంతెనలకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. వాటి మొత్తం విలువ రూ. 15,592 కోట్లు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వీకే సింగ్‌, కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రి శంకర నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, సీఎం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దేశంలో కొత్తగా 63,371 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చుకుంటే  తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం 10,28,622 నమూనాలను పరీక్షించగా..63,371 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 895 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,161కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కృష్ణాకు ఊహించని రీతిలో వరద: కలెక్టర్‌

కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరే అవకాశముందని.. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రానికి వరద పెరిగే అవకాశముందని చెప్పారు. ఊహించని రీతిలో భారీగా వరద వస్తోందన్నారు. బ్యారేజీ నుంచి ప్రస్తుతం 7.50లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని.. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వ్లాగ్‌.. వాహ్‌ అనిపించాలా!!

వాగ్లింగ్‌.. ఇప్పుడు యూట్యూబ్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్న పేరు. సెలబ్రెటీల నుంచి సాధారణ యువత వరకు వాగర్స్‌గా మారిపోతున్నారు. నచ్చిన అంశాలతో వ్లాగింగ్‌ ఛానల్‌ పెట్టేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా కొందరు డీఎస్‌ఎల్‌ఆర్‌లను ప్రయత్నిస్తుంటే.. మరికొందరు వారివారి స్మార్ట్‌ఫోన్‌తోనే సిద్ధం చేసేస్తున్నారు. మరి మీరూ వ్లాగర్‌గా మారాలనుకుంటున్నారా! ధర కాస్త ఎక్కువైనా సరే అదిరే వీడియోల్ని తీసే స్మార్ట్‌ఫోన్‌ ప్రయత్నిద్దామనుకుంటున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి. వ్లాగింగ్‌కి మాత్రం ప్రత్యేకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మైలార్‌దేవ్‌పల్లిలో 4 మృతదేహాలు లభ్యం

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని అలీనగర్‌లో బుధవారం సాయంత్రం వరదనీటిలో గల్లంతైన 8 మందిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. అబ్దుల్‌ తాహిర్‌ కుటుంబానికి చెందిన 8 మంది ఇంటి అరుగుపై కూర్చున్న సమయంలో ఒక్కసారిగా వరద నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. గురువారం రాత్రి రెండు మృతదేహాలను ఫలక్‌నుమా సమీపంలోని నాలాలో గుర్తించగా... మరో రెండు మృతదేహాలను ఇవాళ గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘చీమ’పై కత్తిగట్టిన ట్రంప్‌..!

చైనాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాడార్‌లోకి వచ్చింది. ఈ సంస్థకు కళ్లెం వేయాలని ఆయన కార్యవర్గం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా ఐరోపా ఇతర ప్రాంతాల్లో హువావేను కట్టడి చేసిన ట్రంప్‌ ఇప్పుడు మరో చైనా సంస్థపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన బడా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అలీబాబా గ్రూప్‌నకు చెందిన ‘యాంట్‌ గ్రూప్‌’ను కట్టడి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హాథ్రస్‌ బాధితురాలంటూ ఆమె చిత్రాలు

తన భార్య చిత్రాలను హాథ్రస్‌ బాధితురాలంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరణించిన తన భార్య చిత్రాన్ని.. హాథ్రస్‌ సామూహిక హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలిగా ప్రచారం చేస్తున్నారని అజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శింబు-త్రిష వివాహం..?

‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ఏమాయ చేశావే) చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటీనటులు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేయనున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ తాము మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధానమిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పంజాబ్‌కు ఏమైంది?

యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో అన్ని జట్లది ఒక పరిస్థితి అయితే, పంజాబ్‌ది మరో పరిస్థితి. గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా ప్రత్యర్థులకు అప్పగించేలా కనపడుతోంది రాహుల్‌ టీమ్‌. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ అవకాశాలపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో గతరాత్రి బెంగళూరుపై విజయం సాధించి అభిమానుల్లో ఇంకా ఆశలు రేకెత్తిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆ జట్టు మూడింటిలో గెలిచే అవకాశం ఉన్నా చివర్లో చేతులెత్తేసి ఓటమిపాలైంది. తాజాగా బెంగళూరుతో తలపడిన రెండో పోరులోనూ తేలిగ్గానే విజయం సాధించాల్సి ఉన్నా చివరి బంతి వరకూ తీసుకెళ్లి మ్యాచ్‌పై ఉత్కంఠ కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు పరిస్థితిని ఓసారి పరిశీలిద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

యూనివర్స్‌ బాస్‌ ఇక్కడ.. హార్ట్‌ ఎటాక్‌ తెప్పిస్తా!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.