close

తాజా వార్తలు

Published : 17/10/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. కొవిడ్‌ చికిత్సా విధానం.. పునరాలోచనలో భారత్‌!

కరోనా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్‌.. పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితుల విషయంలో పనిచేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ చికిత్సలో రెమ్‌డిసివిర్‌ వినియోగంపై భారత్‌ పునరాలోచనలో పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8లక్షల దిగువకు క్రియాశీల కేసులు

2. వరద బాధితులకు పరిహారం పంపిణీ

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా కల్పించారు. నాలుగో రోజు హైదరాబాద్‌ నగర శివారులోని అలీనగర్‌, గగన్‌పహాడ్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండ

3. నిన్నెవ్వరూ కాల్చరు.. లొంగిపో!

ఉడుకు రక్తం.. వయసుతో వచ్చిన ఆవేశం.. అర్థం లేని ఆకర్షణ.. గమ్యం లేని లక్ష్యం.. ఇవి ఓ యువకుణ్ని ఉగ్రవాదంలో చేరేలా చేశాయి. కానీ, తన తప్పును తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ముష్కరులు జరిపే రక్తపాతంలో ఇమడలేకపోయాడు. వారిలా కరడుగట్టలేదు. తన కోసం విలపిస్తున్న తండ్రిని చూపి కరిగిపోయాడు. ‘నీకేం కాదు మా వద్దకు రా’ అని పిలుస్తున్న జవాన్లు అతనికి సొంత సోదరుల్లా కనిపించారు. వీటన్నింటి ముందు తన వద్ద ఉన్న ఏకే-47 శక్తిమంతమైందేం కాదనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అయ్యప్ప దర్శనానికి 250 మందే!

ప్రఖ్యాత శబరిమల క్షేత్రంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఆలయం తెరచిన ప్రతిసారీ వేలాదిగా భక్తులు అయ్యప్పను దర్శించుకునే వారు. కానీ, తాజాగా కేవలం 246 మంది మాత్రమే ఆన్‌లైన్‌ పోర్టల్‌లోని వర్చువల్‌ క్యూలో తమ పేర్లను నమోదు చేసుకోవడం గమనార్హం. పటిష్ఠ కొవిడ్‌ నిబంధనల నడుమ 7 నెలల తర్వాత తొలిసారిగా శబరిమల ఆలయం శుక్రవారం తెరచుకుంది. ఇవాళ్టి నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చిన శేషవాహనంపై మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం మలయప్పస్వామి ఐదు తలల చిన శేషవాహనంపై విహరించారు. నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అవతారంలో భక్తులను అభయప్రదానం చేశారు. మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. ఈ రోజు రాత్రి హంసవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

స్వర్ణకవచాలంకృత రూపంలో బెజవాడ దుర్గమ్మ

6. టర్కీలో గతంలో Q,W,X లను నిషేధించారు

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ ఒకటి. కొన్ని దేశాల్లో భాష వేరైనా లిపిని దాదాపుగా లాటిన్‌ ఇంగ్లీష్‌లోనే రాస్తుంటారు. టర్కీలో కూడా లాటిన్‌ ఇంగ్లీష్‌ అక్షరాలు రాసినా, వాటికి అదనంగా మరికొన్ని అక్షరాలూ ఉంటాయి. గతంలో ఈ భాషలోని Q, W, X అక్షరాలను టర్కీ ప్రభుత్వం నిషేధించింది. అక్కడి ప్రజల పేర్లలో ఈ అక్షరాలు ఉన్నా.. పలికినా జరిమానా, శిక్షలు విధించేవారట. కొన్నేళ్ల పాటు కొనసాగిన ఈ నిషేధం 2013లో ఎత్తివేశారు. అసలు ఎందుకు ఈ నిషేధం విధించారు? ఎందుకు ఎత్తివేశారో తెలుసుకుందాం పదండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మీ టైం అయిపోయింది..ఇమ్రాన్‌ ఇక వెళ్లండి

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తూ చికిత్స కోసం లండన్‌లో ఉంటున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరోసారి విమర్శలకు పదునుపెట్టారు. పాక్‌ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావేద్‌ బజ్వాపై విరుచుకుపడ్డారు. బజ్వా వల్లే గత ప్రభుత్వం కూలిపోయిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి గుజ్రాన్‌వాలాలో నిర్వహిస్తున్న ఆందోళనలో లండన్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిహారిక-చైతన్య డెస్టినేషన్‌ వెడ్డింగ్‌..!

మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న విషయం తెలిసిందే. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇటీవల నిశ్చితార్థంతో ఒక్కటైన నిహారిక-చైతన్య పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నిహారిక పెళ్లి విషయంలో మేమెంతో సంతోషంగా ఉన్నాం. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఎంతో క్లిష్టంగా మారింది. ఇలాంటి కఠిన సమయం నుంచి కొంతవరకూ బయటకు వచ్చేలా కుటుంబంలో శుభకార్యం జరగడం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజస్థాన్‌కు మరో పరీక్ష..!

ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఎనిమిది మ్యాచుల్లో కేవలం మూడు విజయాలతో రాజస్థాన్‌ ఏడో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే దాదాపు అన్ని మ్యాచుల్లోనూ నెగ్గాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు దుబాయ్‌ వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. రాజస్థాన్‌ను చిత్తుచేసి కోహ్లీసేన తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుండగా.. బెంగళూరుపై గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని స్మిత్‌సేన భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బర్త్‌డే స్పెషల్‌: కీర్తి డ్రీమ్‌ టు డేరింగ్‌ రోల్స్‌..!

అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? ఆ అద్భుతమైన నటి పాత్రకు మరొకరు జీవం పోయడం వీలుకాని విషయమేనని.. 2018 వరకు సినీ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అదే ఏడాది మే నెలలో ‘మహానటి’తో అందరి అభిప్రాయాలు తారుమారు చేశారు కీర్తి సురేశ్‌. ‘సావిత్రి’లా హావభావాలు పలికించి.. అందరి మెప్పు పొందారు. అందుకే ఆమె నటనకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రదానం చేసింది. ఇటు కమర్షియల్‌ చిత్రాలతోపాటు అటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న వైవిధ్యమైన సినిమాలతోనూ అలరిస్తూ కెరీర్‌లో ముందుకెళ్తున్న ఈ భామ శనివారం తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.