close

తాజా వార్తలు

Updated : 19/10/2020 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ఏపీ తెదేపా అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్‌.రమణ కొనసాగనున్నారు. ఈ మేరకు అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు. 27 మంది సభ్యులతో తెదేపా కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో 25 మందితో తెదేపా పొలిట్‌ బ్యూరో ఏర్పాటు చేశారు. తెదేపా జాతీయ ఉపాధ్యక్షుల్లో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పండుగల వేళ మరింత జాగ్రత్త

ప్రజల సహకారంతోనే తెలంగాణలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు శ్రీనివాస్‌, వైద్య విద్యా సంచాలకులు రమేశ్‌ అన్నారు. ప్రస్తుతం బతుకమ్మ, మరి కొన్ని రోజుల్లో దసరా, దీపావళి, క్రిస్మస్‌ పండుగలు రాబోతున్నాయని.. కరోనా వైరస్‌ విషయంలో పండుగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ముందు నుంచి విజయవంతంగా కృషి చేసిన కేరళలో ‘ఓనం’ పండుగ తర్వాత తిరిగి కరోనా మళ్లీ విజృంభిస్తోందని వారు గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

ప్రకృతి శోభను సమకూర్చేది వృక్షం. సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా అన్ని వృక్షాల్లో మేటి కల్పవృక్షం. ఇది మనోవాంచిత ఫలాలను అందిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటి కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని బ్రహ్మోత్సవాల నాలుగో రోజు ఉదయం వేంకటేశ్వరుడు దర్శనమిస్తున్నారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులు ఉండవట.పూర్వ జన్మ స్మరణ కలుగుతుందని పురాణాలు వినిపిస్తున్నాయి. కోరిన ఫలాలు ఇచ్చే కల్పవృక్షాన్ని భక్తులు చూడలేకపోయినా.. వారి మనోవాంఛలు గమనించి ఫలాలు ప్రసాదించే దేవదేవుడు ఏడుకొండలవాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* శ్రీగాయత్రి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

4. 24 గంటల్లో 55 వేల కేసులు.. 579 మరణాలు

 దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం 8,59,786 నమూనాలను పరీక్షించగా 55,722 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,50,273కు చేరింది. గడిచిన 24 గంటల్లో 579 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,610గా నిలిచింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 66,63,608 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,72,055 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఇమ్రాన్‌ పాలన నియంతల కంటే దారుణం’

పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘పాకిస్థాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్’‌(పీడీఎం) తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఆదివారం కరాచీలోని భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలందరూ ఒకే వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అత్యంత అసమర్థుడని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా అతనికి సమాచారం ఉండడం లేదని ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ’ అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ముక్కు ద్వారా కరోనా టీకా..!

కరోనా వైరస్‌ కట్టడి కోసం ముక్కు ద్వారా ఉపయోగించే టీకా‌ చివరిదశ ప్రయోగాలను దేశంలో భారీస్థాయిలో చేపట్టనున్నారు. ప్రాథమిక దశ తర్వాతి దశ ట్రయల్స్‌ను భారత్‌కు చెందిన ఫార్మా సంస్థలు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) త్వరలోనే అనుమతించనుంది. కొద్దినెలల వ్యవధిలోనే దేశంలో ‘ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌’ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పురానాపూల్‌ వంతెనకు పగుళ్లు

రాజధాని హైదరాబాద్‌లో కురిసిన వర్షాలతో  పురానాపూల్‌ వద్ద మూసీ నది వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వంతెనపై రాకపోకలను నిషేధించారు. అక్కడికి చేరుకున్న అధికారులు వంతెన పరిస్థితిని పరిశీలిస్తున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి మూసీలో వరద ఉద్ధృతి పెరగడంతో ఒకచోట పిల్లర్‌ స్వల్పంగా కుంగింది. పురానాపూల్‌ వంతెన పరిస్థితిని చూసిన స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.  మరోవైపు వరద తాకిడికి మీర్‌పేట చెరువుకట్ట బలహీన పడింది. దీంతో కొట్టుకుపోతుందన్న అనుమానంతో స్థానిక ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బైడెన్ వల్ల భారత్‌కు మంచి జరగదు:జూనియర్‌ ట్రంప్‌

 డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ చైనా పట్ల మెతక వైఖరి అవలంబించే అవకాశం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ తనయుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ అభిప్రాయపడ్డారు. డ్రాగన్‌ పట్ల ఉదారంగా వ్యవహరించే వారితో భారత్‌కు ఏ మాత్రం మంచి జరగబోదని వ్యాఖ్యానించారు. ‘‘చైనా వల్ల ఎంత ముప్పో బహుశా భారతీయ అమెరికన్లుగా తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అధ్యక్ష రేసులో మన ప్రత్యర్థులుగా ఉన్న బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు చైనీయులు 1.5 బిలియన్‌ డాలర్లు ఇచ్చారు. బైడెన్‌ అమ్ముడుపోయే వ్యక్తి అని తెలిసే వారలా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మ్యారేజ్‌ లైఫ్‌ ఓ టెన్షన్‌: అఖిల్‌

 ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50శాతం కెరీర్‌.. 50 శాతం మ్యారేజ్‌ లైఫ్‌. కెరీర్‌ను సూపర్‌గా సెట్‌ చేశా. కానీ, ఈ మ్యారేజ్‌ లైఫే...’ అని నిట్టూరుస్తున్నారు యువ కథానాయకుడు అఖిల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హర్ష అనే పాత్రలో అఖిల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయనకి జంటగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మనసా మనసా’ అనే పాట ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గేల్‌కు కోపమొచ్చింది..!

ముంబయి, పంజాబ్‌ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ ఇరు జట్లతో దాగుడుమూతలు ఆడింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు సూపర్‌ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది. తొలి సూపర్‌ ఓవర్‌లో స్కోర్లు సమం కావడంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఆ ఓవర్‌లో పంజాబ్‌ తరఫున గేల్‌, మయాంక్‌ బ్యాటింగ్‌కు దిగారు. అయితే.. బ్యాటింగ్‌కు దిగే ముందు..గేల్‌ కోపం, అసంతృప్తితో కనిపించాడు. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు యూనివర్స్‌ బాస్‌ తొలి బంతికే సిక్సర్‌ అందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.