close

తాజా వార్తలు

Published : 21/10/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ఏపీలో వైఎస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘వైఎస్‌ఆర్‌ బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా బీమా సదుపాయం కల్పిస్తారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 1.41 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. బీమా నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పకున్నా భరించేందుకు సిద్దమయ్యామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రక్షణ విషయంలో రాజీపడొద్దు: జగన్‌

2. టీకా కోసం వైరస్‌ ఎక్కిస్తారు!

బ్రిటన్‌ ప్రభుత్వం కొంతమంది ఆరోగ్యవంతులైన యువతకు కరోనా వైరస్‌ అంటించబోతోంది! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే ఇది కరోనా నివారణ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగానే. ‘హ్యూమన్‌ ఛాలెంజ్‌ అధ్యయనం’గా పిలిచే ఈ పరిశోధనలో టీకాల పనితీరును పరీక్షించడానికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి వైరస్‌ను ఎక్కించి ప్రయోగాలు చేస్తారు. ఇలా ప్రయోగాల కోసం వైరస్‌ బారిపడేలా చేయడం ప్రమాదకరం, అనైతికమన్న కారణాలతో ఈ విధానం వివాదాస్పదమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ​​​​​కొత్త కేసుల తగ్గుదలకు బ్రేక్‌!

దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గే పరంపరకు బ్రేక్ పడింది. గత 24 గంటల్లో దేశంలో 54,044 కొత్త కేసులు వచ్చాయి. నిన్న 46,790 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మరణాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. తాజాగా 717 మంది వైరస్‌ సోకి మృత్యువాతపడ్డారు. గత రెండురోజులు వరుసగా మరణాలు 600లోపునకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 9.67 శాతంగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘హక్కుల సాకుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం’

దేశంలో స్వచ్ఛంద సంస్థలపై ఆంక్షలు, సామాజిక కార్యకర్తల అరెస్టులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కమిషన్‌లో మిషెల్‌ బ్యాచెలెట్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. మానవ హక్కుల సాకుతో చట్టాల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంపై ఐరాస మానవ హక్కుల సంఘం మరింత అవగాహనతో స్పందించాల్సిన అవసరం ఉందని హితవు పలికింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ప్రకటన విడదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఘనంగా శ్రీవారి హనుమంత వాహనసేవ

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు హనుమంతుడు. హనుమంతుని స్మరిస్తే ధైర్యం, ఆరోగ్యం, బుద్ది, బలం, యశస్సు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సరస్వతీదేవిగా బెజవాడ దుర్గమ్మ

6. కంగనా రనౌత్‌కు బెదిరింపులు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కంగన తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన కొన్ని ఫొటోలకు ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులతో కూడిన కామెంట్స్‌ వచ్చాయి. ‘నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా’ అంటూ వచ్చిన కామెంట్స్‌ చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫలించిన నాసా పదేళ్ల కృషి!

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ‘ఒసైరిస్‌-రెక్స్‌’ వ్యోమనౌక ‘బెన్ను’ అనే గ్రహశకలంపై విజయవంతంగా దిగింది. అన్ని అనుకున్నట్లుగానే జరిగినట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లారేటా తెలిపారు. గ్రహశకలంపై దిగగానే ఒసైరిస్‌ నాసా కేంద్రానికి సంకేతాలు పంపినట్లు వెల్లడించారు. అయితే, ఆ గ్రహశకలపు నమూనాలను సేకరించే అసలు లక్ష్యాన్ని అది ఎంత వరకు పూర్తి చేసిందన్నది తెలియరాలేదు. ఇది తెలుసుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందన్నారు. ఒకవేళ నమూనాల్ని సేకరించలేదని తేలితే మరోసారి ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భీముడిగా నటుడు శ్రీహరి

నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. దీంతో దసరా కానుకగా ‘నర్తనశాల’ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల బాలకృష్ణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ‘అర్జునుడి’గా బాలయ్య లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం నేడు శ్రీహరి లుక్‌ను అభిమానులతో పంచుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వీళ్లంతా.. బంతిని కేకలు పెట్టించారు

టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అర్ధశతకం చేస్తేనే ఎక్కువ. ఎందుకంటే.. క్రీజులో కుదురుకొని పిచ్‌ను అర్థం చేసుకునేంత సమయం ఉండదు. శతకానికి కావాల్సినన్ని బంతులు అంతకన్నా ఉండవు. పైగా బౌలర్ల నుంచి వైవిధ్యభరితంగా దూసుకొచ్చే బంతులు. యార్కర్‌లు.. స్లో డెలివరీలు.. ఆఫ్‌ కట్టర్లు.. గూగ్లీలు.. పేరేదైనా బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడమే వాటి లక్ష్యం. అయితే.. వాటన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చీరావడంతోనే బాదుడు మొదలుపెట్టడమే సెంచరీ కొట్టేయడానికి ఉన్న ఏకైక మార్గం. మరి అలాంటి విలువైన సెంచరీని సీజన్‌కు ఒకటి కంటే ఎక్కువ చేసిన ఆటగాళ్లున్నారు. వాళ్లెవరో చూసేద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘రాధేశ్యామ్‌’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది..!

ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలయ్యింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా కనిపించనున్నారు. ప్రభాస్‌ పుట్టినరోజును(అక్టోబర్‌ 23) పురస్కరించుకుని ‘రాధేశ్యామ్‌’ సినిమాలో ఆయన లుక్‌ను‌ తెలియజేసేలా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.