close

తాజా వార్తలు

Published : 25/10/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ఏపీలో భాజపా బలపడుతుంది: కిషన్‌రెడ్డి

ఏపీలో భారతీయ జనతాపార్టీ బలమైన శక్తిగా.. ప్రజల గొంతుకగా రూపుదిద్దుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని, రానున్న రోజుల్లో ఖచ్చితంగా భాజపా బలపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విజయదశమి పూజలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆయుధపూజ నిర్వహించిన రాజ్‌నాథ్ సింగ్‌

చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోవాలని కోరుకుంటున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్న ఆయన.. పర్యటనలో భాగంగా డార్జిలింగ్‌ లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడున్న ఆయుధాలకు పూజలు నిర్వహించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు సమసిపోయి, సరిహద్దుల్లో శాంతి స్థాపన జరగాలన్నదే భారత్‌ అభిమతమని రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌లో 8.50% మాత్రమే యాక్టివ్‌ కేసులు

 దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు దిగువగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం 11,40,905 నమూనాలను పరీక్షించగా 50,129 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811 నమోదైంది. గడిచిన 24 గంటల్లో 578 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,18, 534కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో కొత్తగా 978 కరోనా కేసులు

4. పవన్ కొత్త సినిమా.. వీడియో చూశారా..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పటికే క్రిష్‌, హరీశ్‌ శంకర్‌లతో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్‌ మరో కొత్త ప్రాజెక్ట్‌ ఓకే చేశారు. తార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో పవన్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజరాజేశ్వరీదేవిగా బెజవాడ దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి  ఉత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. చెరకు గడను ఎడమచేతిలో ధరించి కుడి చేతితో అభయాన్ని ప్రాసాదింపజేసే రూపంతో ఉన్న రాజరాజేశ్వరీ దేవిని దర్శించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మా వేగం.. అతి భయానకం!

టీ20 క్రికెట్ అంటేనే వేగం. బ్యాటర్‌ ఎంత త్వరగా అర్ధశతకం చేశాడు? వికెట్ల మధ్య ఎంత చురుగ్గా పరుగెత్తాడు? అన్నదే ఎక్కువగా చూస్తాం. మెరుపు వేగంతో బంతులు విసిరే బౌలర్లను మాత్రం అంతగా పట్టించుకోం! కానీ బుల్లెట్ల మాదిరిగా బంతులు విసిరే బౌలర్లనే జట్లు కోరుకుంటాయి. వారినే ప్రోత్సహిస్తాయి. అందుకే యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్‌ టీ20 లీగులో ఏయే పేసర్లు‌ ఎంత వేగంతో బంతుల్ని సంధించారు? ఎంతగా ఆకట్టుకున్నారో ఓసారి చూద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* దడ పుట్టిస్తున్న రబాడ

7. అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం

నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో ఓ ట్యాంకర్‌ లారీ అదుపుతప్పి ఇతర వాహనాలను తప్పిస్తూ రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈప్రమాదంలో ట్యాంకర్‌ లారీ నుంచి ఇంధనం లీకవడంతో అగ్నిప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శకటాన్ని రప్పించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు.. మండిపడ్డ బైడెన్‌

గాలి కాలుష్యంపై స్పందిస్తూ భారత్‌ మురికి దేశమంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ మండిపడ్డారు. మిత్రులతో మాట్లాడాల్సిన పద్ధతి అదికాదన్నారు. ‘అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ దేశాన్ని మురికిగా పిలిచారు. మన స్నేహితుల గురించి మాట్లాడే తీరు ఇది కాదు. వాతావరణ మార్పు వంటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే మార్గం కూడా ఇది కాదు’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  నేను, కమలా హారిస్‌ భారత్‌తో అమెరికా  భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తాం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ ప్యాలెస్‌ను తిరిగి కొనలేదు: సైఫ్‌

తన కుటుంబానికి వారసత్వంగా వస్తోన్న పటౌడీ ప్యాలెస్‌ను రూ.800 కోట్ల చెల్లించి ఓ హోటల్‌ గ్రూప్‌ నుంచి బాలీవుడ్‌ హీరో సైఫ్‌ తిరిగి కొనుగోలు చేశారంటూ వస్తోన్న వార్తలపై సదరు నటుడు స్పందించారు. అవన్నీ అవాస్తమని కొట్టిపారేశారు. పటౌడీ ప్యాలెస్‌తో తనకు అమితమైన అనుబంధం ఉందని తెలిపారు. ‘పటౌడీ ప్యాలెస్‌తో నాకు ఎన్నో మధురానుభూతులున్నాయి. మా పూర్వీకులు దానిని నిర్మించి.. కొంతకాలంపాటు రాజ్యపాలన చేశారు. అది కేవలం ప్యాలెస్‌ మాత్రమే కాదు ఓ గౌరవం. అలాంటి ప్యాలెస్‌ను మేము ఓ హోటల్‌ గ్రూప్‌కి అమ్మేశామని.. ఇటీవల దాదాపు రూ.800 కోట్లు చెల్లించి దానిని తిరిగి కొనుగోలు చేశానని వస్తోన్న వార్తల్లో నిజం లేదు’ అని సైఫ్‌ అన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చాలా బాధగా ఉంది: డేవిడ్‌ వార్నర్

పంజాబ్‌పై 12 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడం చాలా బాధకు గురి చేసిందని హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన వార్నర్‌ తమ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే, ఓటమిపాలవ్వడం మాత్రం బాధగా ఉందన్నాడు. పంజాబ్‌ను కట్టడి చేయడంలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, ఛేదనలో శుభారంభం దక్కాక ఆ లయను కోల్పోయామని చెప్పాడు. మరోవైపు ఆ వికెట్‌పై ఆడటం చాలా కష్టమని.. ఒక్కసారి స్పిన్‌ బౌలింగ్‌ బరిలోకి దిగితే అంతేనని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.