close

తాజా వార్తలు

Published : 26/10/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. మాజీ కేంద్ర మంత్రికి 3ఏళ్ల జైలు శిక్ష

బొగ్గుగనుల కేటాయింపు కేసులో దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌ రేకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరు దోషులకు కూడా అదే శిక్షను ఖరారు చేసింది. 1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో దిలీప్‌ రే బొగ్గు గనులశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఝార్ఖండ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. చైనా పేరెత్తకుండానే చక్కబెట్టేస్తున్నారు..! 

అమెరికాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు కేవలం వారం మాత్రమే గడువు ఉంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన కార్యవర్గం ప్రచారంలో తలమునకలైంది.. అదే సమయంలో ట్రంప్‌ అత్యంత కీలకమైన వ్యక్తిగా భావించే సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో, డిఫెన్స్‌ సెక్రటరీ మార్క్‌ ఎస్పర్‌లు భారత్‌కు వచ్చేందుకు విమానమెక్కారు. కొవిడ్‌ సమయంలో పాంపియో చాలా దేశాల పర్యటనలను రద్దు చేసుకొని.. వర్చువల్‌ మీటింగ్స్‌లోనే పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన నేరుగా భారత్‌ రావడానికి చాలా పెద్దకారణమే ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా’

బిహార్‌ ప్రజలకు ఉచితంగా కరోనా టీకా అందజేస్తామన్న భాజపా ఎన్నికల హామీ రాజకీయ దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రతాప్‌ సారంగి ఆదివారం చేసిన కొన్ని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తామని ప్రకటించారని తెలిపారు. అందుకోసం ఒక్కో వ్యక్తికి రూ.500 కేటాయిస్తున్నారన్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరగనున్న ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గృహనిర్బంధాన్ని ఎత్తివేయాలి: చంద్రబాబు

చిత్తూరు తెదేపా నాయకుల అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెదేపా తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నామని చెప్పారు. తక్షణమే తెదేపా నేతల గృహనిర్బంధం ఎత్తివేయాలని, అక్రమకేసులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సూది లేకుండానే కొవిడ్‌టీకా..!

నవంబర్‌ వచ్చేసింది.. ఎక్కడ చూసినా ఇప్పుడు కొవిడ్‌ టీకా ఎప్పుడు వస్తుందనే చర్చే జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే టీకాల అభివృద్ధి కూడా రాకెట్‌ వేగంతో జరుగుతోంది. అదే సమయంలో ఓ కొత్త రకం టీకా జనం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ టీకా..! అదేనండీ ముక్కులో వేసుకొనే వ్యాక్సిన్‌..! ప్రస్తుతం దీనికి సంబంధించిన అడ్వాన్స్‌‌డ్‌ స్టేజి ప్రయోగాలు భారత్‌లో ప్రారంభం కానునున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 2 పడకగదుల ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్‌

రెండు పడక గదుల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని జియాగూడలో 2 పడక గదుల డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళలు మంత్రి కేటీఆర్‌కు బోనాలతో స్వాగతం పలికారు. ఈ కాలనీలో 840 రెండు పడక గదుల నివాసాలను ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా 568 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఇలా ఉండాలి..

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భేదాభిప్రాయాలు పక్కనపెట్టి ఏకతాటిపై నడవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. బెర్లిన్‌లో జరుగుతున్న మూడు రోజుల ప్రపంచ ఆరోగ్య సమావేశం (వరల్డ్‌ హెల్త్‌ సమ్మిట్‌) ప్రారంభం సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్‌ అథనోమ్‌ వీడియో మాధ్యమంలో ప్రసంగించారు. కొవిడ్‌-19 టీకా విషయంలో జాతీయవాదాన్ని పాటించటం తెలివైన చర్య కాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సూపర్‌ కార్స్: అప్పుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే?

కాలం మారుతున్న కొద్దీ కొత్త మోడల్‌ కార్లు వస్తూనే ఉంటాయి. కానీ పాత కార్లలో కనిపించే ఆ దర్పం మాటల్లో వర్ణించలేనిది. అంతరించిపోతున్న పాత మోడల్‌ కార్ల‌ను వాహన ప్రియులు సేకరిస్తూనే ఉంటారు. వాటిని అపురూపంగా చూసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. అలాంటి కార్ల తొలి మోడల్‌, తాజా మోడల్‌ గురించి తెలుసుకుందామాపూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాన్‌ ఇండియా మూవీ: ఎవరెక్కడ?

పాన్‌ ఇండియా. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట. ఒకట్రెండు భాషల్లో ఏకకాలంలో నిర్మించిన చిత్రాన్ని మిగిలిన భాషల్లోకి అనువదించినంత మాత్రాన పాన్‌ ఇండియా సినిమా అయిపోదు. కథ, కథనం, నటీనటులు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగం ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగలదు. ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర కథానాయకుల చిత్రాలు పాన్‌ ఇండియాను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతున్నాయి. హీరోలు సైతం అలాంటి కథలను చేసేందుకే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ హీరో ఏ ర్యాంకులో ఉన్నాడో ఓసారి చూస్తే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం.. ఇదొక ఆట మాత్రమే!

టీ20 లీగ్‌ చరిత్రలో చెన్నై తొలిసారి ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశం కోల్పోయింది. ఆదివారం రాజస్థాన్‌.. ముంబయిని ఓడించడంతో చెన్నై కథ ముగిసింది. నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో ధోనీసేన.. బెంగళూరుపై విజయం సాధించినా 12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లే సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే మిగతా రెండు మ్యాచ్‌లు గెలిచినా చెన్నై ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు మూసుకుపోయాయి. ఈ సందర్భంగా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగపూరిత పోస్టు చేసింది. ఇది చెన్నై అభిమానులనే కాకుండా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.