close

తాజా వార్తలు

Published : 27/10/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత నిధులను మంగళవారం ఏపీ సీఎం జగన్‌ విడుదల చేశారు. మొత్తం 50.07 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,114 కోట్లు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు. 50లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే సంతోషంగా ఉందన్నారు. 41,000 అటవీ భూముల సాగుదార్లకు కూడా సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి సహాయం అందుతోందన్నారు. ‘‘పాత అప్పులకు జమ చేసుకోని విధంగా ఈ సాయం అందిస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది’’ అని సీఎం వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకం

భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ బేసిక్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా) ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఇందు కోసం వారు దిల్లీలో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌, అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో హైదరాబాద్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆరోపణలు అవాస్తవం: సిద్దిపేట సీపీ

తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. మంగళవారం ఉదయం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్దిపేటలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముందస్తు సమాచారంతోనే నిన్న సోదాలు నిర్వహించామన్నారు. సోదాలపై అధికారులు పంచనామా కూడా తయారు చేశారని వెల్లడించారు. తమ సిబ్బంది డబ్బు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా బారెట్‌ తొలి ప్రమాణం!

అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎమీ కోనీ బారెట్‌ నియామకాన్ని సెనేట్‌ ధ్రువీకరించింది. దీంతో శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌ సమక్షంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ ఆమెతో ప్రమాణం చేయించారు. న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ఆమె రెండు ప్రమాణస్వీకారాలు చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి రాజ్యాంగపరమైన ప్రమాణం ప్రస్తుతం పూర్తయింది. రెండోది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో న్యాయపరమైన ప్రమాణం మంగళవారం జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 40 వేల దిగువకు తాజా కేసులు..

దేశంలో కరోనా కేసులు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. తొలిసారిగా 40 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. సోమవారం 9,58,116 నమూనాలను పరీక్షించగా 36,469 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,46,429గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 488 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,19,502కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చిత్తూరు జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకురావాలని కోరుతూ రామకుప్పం మండలంలో తెదేపా నేతలు సోమవారం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో నేతల గృహ నిర్బంధాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మంగళవారం లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొనసాగుతున్న బండి సంజయ్‌ దీక్ష

దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్‌ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి  సంజయ్‌ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. సీపీని బదిలీ చేసి కేసు నమోదు చేసేవరకు తన కార్యాలయంలోనే దీక్షలో ఉంటానని సంజయ్‌ ప్రకటించారు. బయటి నుంచి తాళం వేసుకుని రాత్రి నుంచి కార్యాలయంలోనే నిర్బంధ దీక్ష  కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చంద్రుడిపై అన్వేషణ..మరో ముందడుగు

శాస్త్రవేత్తలు అంచనా వేసినదానికంటే చంద్రుడిపై ఎన్నో రెట్లు అధికంగా నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. చంద్రుడిపై సూర్యకాంతి పడే ప్రదేశంలో కూడా నీటి జాడలు ఉన్నట్లు తొలిసారి వెల్లడికావడం అంతరిక్ష పరిశోధనల్లో కీలకపరిణామమని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాసాకు చెందిన సోఫియా టెలిస్కోప్‌ ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. భూమికి అతి సమీపంలో ఉన్న ఈ ఉపగ్రహంపై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని ఒక దశాబ్దం క్రితం వరకు అభిప్రాయపడేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘పెళ్లిసందడి’లో హీరో ఇతడే!

 ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల రాఘవేంద్రరావు వెల్లడించారు. తాజాగా ఈ చిత్రంలోని కథానాయకుడిని పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. రోషన్‌ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు. నటుడు శ్రీకాంత్‌-ఊహాల తనయుడే రోషన్‌. గతంలో ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో నటించి మెప్పించాడు. ఇప్పుడు తండ్రి నటించిన ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో వస్తున్న చిత్రంలో నటిస్తూ కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మ్యాచ్‌ను ముగించి తండ్రికి నివాళి

తండ్రి మరణించిన బాధను దిగమింగి మన్‌దీప్‌సింగ్‌ ఆడిన విధానం తమకు భావోద్వేగం కలిగించిందని పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. బయో బుడగలో సొంతవారెవరూ దగ్గర ఉండని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతటి కష్ట సమయంలోనూ అతడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడని కొనియాడాడు. దుబాయ్‌లో ఉండటం వల్ల తన తండ్రి అంత్యక్రియల్లో మన్‌దీప్‌ వీడియోకాల్‌ ద్వారా హాజరయ్యాడని వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.